వికారాబాద్‌లో ప్రారంభించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య
హైదరాబాద్,సెప్టెంబర్11(ఇయ్యాల తెలంగాణ) : టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలని చెప్పారు. వికారాబాద్‌లో డ్రోన్ సాయంతో మారుమూల ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ’మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రోన్ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందని అన్నారు. గ్రహంబెల్ టెలిఫోన్, రైట్ బ్రదర్స్ విమానం లాగే డ్రోన్ టెక్నాలజీ ఓ సంచలనమని చెప్పారు. డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేస్తున్న యువతను అభినందించారు. ఇలాంటి సాంకేతికతను అందించడమే ప్రధాని మోదీ స్వప్నమని తెలిపారు. డ్రోన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. స్టార్టప్‌లను తేలిగ్గా చూడద్దని సూచించారు. చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను మోసుకెళ్తోందని వెల్లడిరచారు. డ్రోన్‌తో మారుమూలకు మందులు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. అన్నదాతలు, జ్ఞానదాతలు ముఖ్యమని చెప్పారు. ఏరోస్పేస్ టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయని చెప్పారు. అన్ని రాష్టాల్రతో చర్చించి గ్రీన్జోన్లు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నామని, ఈరోజు చారిత్రాత్మక దినమని మంత్రి కేటీఆర్ అన్నారు. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని, సామాన్యుడికి ఉపయోగంలేని సాంకేతికత వ్యర్థమని చెబుతారన్నా రు. వికారాబాద్‌లో ’మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమర్జింగ్ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అధునాత టెక్నాలజీతో మందులను సరఫరా చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేయ వచ్చని వెల్లడిరచారు. ఆరోగ్య రంగంలోనే కాదు, అనేక రంగాల్లో డ్రోన్ వాడొచ్చని తెలిపారు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లను వాడుతున్నామని, అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్ చప్పుళ్లకే భయపడతారని వెల్లడిరచారు. మైనింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను కట్టడి చేయవచ్చన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని ఏరోస్పేస్ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఏవియేషన్ వర్సిటీగా మార్చాలని కేంద్ర మంత్రిని సింధియాను కోరారు. వికారాబాద్ కొత్త కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబిత, అధికారులు పాల్గొన్నారు. సమారు 40 కిలోవిూటర్ల వరకు డ్రోన్లు ప్రయాణించబి నున్నాయి. ఒక్కో డ్రోన్‌లో 15 రకాల ఔషధాలు, టీకాల సరఫరాకు అవకాశం ఉంది. భూమికి 500`700 విూటర్ల ఎత్తులో డ్రోన్ ప్రయాణించనుంది.