Ticker

6/recent/ticker-posts

Ad Code

అల్పపీడనానికి దోడు చురుకుగా రుతుపవనాలు

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు


నిజాంసగర్‌ ప్రాజక్టుకు భారీగా వరద

కందకుర్తివద్ద గోదావరి ఉధృతి..జూరలకు పెరిగిన వరద

హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(ఇయ్యాల తెలంగాణ): అల్పపీడనానికి తోడు తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. 16 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సూచించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తం గా వర్షం దంచికొట్టింది. గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టుతోపాటు 625 చెరువులు నిండుకుండల్లా మారాయి. పాలమూరు జిల్లాను వర్షం కుమ్మేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని పెద్ద చెరువు అలుగు పారింది. నిజామాబాద్‌ జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది.


 ప్రాజెక్టులోకి 61,310 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1,24,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 7500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1090.5 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలకుగాను 87.561 టీఎంసీలు ఉన్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో క్రమంగా ప్రవాహం పెరుగుతున్నది. దీంతో నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కుండపోతగా వాన కురిసింది. దీంతో గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది. జుక్కల్‌లోని కౌలాస్‌ నాలా ప్రాజెక్ట్‌?కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌?లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కౌలాస్‌ నాలా ప్రాజెక్ట్‌ ఇన్‌ ప్లో, ఔట్‌ ఎª`లో 2,454 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 458 విూటర్లుగా ఉండగా.. ప్రస్తుతం 457.70 విూటర్లుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 1.237 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.165 టీఎంసీలుగా ఉంది. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ భారీగా వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. 


అధికారులు ప్రాజెక్ట్‌ 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్‌ప్లో 93,836 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఎª`లో 1,01,558 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 19.230 టీఎంసీలుగా కొనసాగుతుంది.ఇకపోతే  మూసీ ప్రాజెక్ట్‌కు క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌?లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్‌  5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఇన్‌ ఎª`లో, ఔట్‌ ఎª`లో 9,343 క్యూసెక్కులు కొనసాగుతుంది. మూసీ పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.62 టీఎంసీలుగా ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. జూరాల ఇన్‌ఫ్లో 1.03 లక్షల క్యూసెక్కులు కాగా, ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 విూటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.390 విూటర్లు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.39 టీఎంసీలు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు