శిఖర్ ధావన్, వ్రేయస్‌లకు దక్కని చోటు
కోహ్లీ,రోహిత్‌లు ఓపెనర్లుగా దిగాలని సూచన
ముంబయి,సెప్టెంబర్8(ఇయ్యాల తెలంగాణ): ఐసిసి టి20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యుఎఇ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ మ్యాచులు జరగనున్నాయి. నిజానికి ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉంది. కానీ, దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ యుఎఇకి తరలిపొయింది. ఈ మెగా టోర్నీ కోసం చాలా దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. అయితే బిసిసిఐ కంటే ముందే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టి20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన తన జట్టును ప్రకటించాడు. అయితే, సన్నీ జట్టులో శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు మూడో స్థానాన్ని కేటాయించాడు. కాగా, పాండ్య సోదరులిద్దరికీ తన జట్టులో సన్నీ స్థానం కల్పించారు.జట్టులో ªరిళిహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్పీత్ర్ బుమ్రా, మహ్మద్ షవిూ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్. అయితే వాషింగ్టన్ సుందర్ ఫిట్ నెస్ సాధిస్తేనే చోటు దక్కుతుందని గవాస్కర్ చెప్పారు.
``````