Ticker

6/recent/ticker-posts

Ad Code

INSPIRE - అవార్డ్ MANAK - 2021-22 నామినేషన్ల చివరి తేదీ 15 అక్టోబర్

 

హైదరాబాద్, ఆగస్ట్ 31 (ఇయ్యాల తెలంగాణ) : 

 INSPIRE - అవార్డ్ MANAK - 2021-22  నామినేషన్ల చివరి  తేదీ 15th  అక్టోబర్  2021.

ఇన్ స్పైర్ అవార్డ్ మనాక్  2020-21 ఆన్లైన్లో ప్రయోగాల నమోదు ప్రక్రియ తేదీ సెప్టెంబర్  1 నుండి 20 , 2021 వరకు ఉంటుంది.

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించడానికి  INSPIRE - అవార్డ్ MANAK సరైన వేదిక అని జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్ రోహిణి గారు తెలిపారు.

గత సంవత్సరం  INSPIRE - అవార్డ్ MANAK  2020-21 కు సంబంధించిన హైద్రాబాద్ జిల్లా నుండి 161  INSPIRE  అవార్డులు  సాధంచారని , అవార్డులు పొందినవారు  విద్యార్థినీ విద్యార్థులకు  INSPIRE - అవార్డ్ MANAK తరఫున  (DBT) డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా  రూ. 10,000 /- వారి ఖాతాలో జమ చేయబడ్డాయి. విద్యార్థిని విద్యార్థులు అందరూ తమ గైడ్ టీచర్ సహాయంతో  ప్రాజెక్ట్ లను తయారు చేసుకొని ఈ సెప్టెంబర్ 1 తేది లోపు సంసిద్ధంగా ఉండాలని  మరియు సెప్టెంబర్ 1 నుండి 20 లోపు తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో MANAK కాంపిటీషన్  యాప్ ద్వారా  తమ ప్రాజెక్టులను అప్లోడ్ చేసుకోవాల్సిందిగా DEO ఆర్. రోహిణీ సూచించారు. హైదరాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో ఉపవిద్యాశాఖాధికారులకు తమ మండలాలలో అందరూ విద్యార్థిని విద్యార్థులు MANAK కాంపిటీషన్ యాప్ లో నమోదు చేసుకొనేటట్లు చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

INSPIRE - అవార్డ్ MANAK 2021-22 నామినేషన్లు మరియు Online  ప్రయోగాల నమోదు పై Zoom మీటీంగ్ ద్వారా అవగాహన కార్యక్రమం DEO ఆర్. రోహిణి ఆధ్వర్యంలో జిల్లా సైన్స్ అధికారి  సీ. ధర్మేందర్ రావు నిర్వహించడం జరిగింది. INSPIRE - అవార్డ్ MANAK - 2021-22 నామినేషన్ల పై అవగాహన కార్యక్రమము ఈ నెల 25, 26 మరియు 27 తేదీలలో  హైద్రాబాద్ జిల్లాలన్నీ అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులకు  Zoom మీటీంగ్ ద్వారా అవగాహన కల్పించడం జరిగినది.

 Zoom మీటీంగ్ లో SCERT సలహాదారులు ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ బాబు, జిల్లా సైన్స్ అధికారి సీ. ధర్మేందర్ రావు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ రఘునందన్ కుమార్, డాన్ బర్డ్స్ హైస్కూల్ కంప్యూటర్ ఫ్యాకల్టీ తిరుపతి రెడ్డి, లర్నింగ్ లింక్ ఫౌండేషన్ ఫరాన్ బేగంగారు, మల్లేశం   Zoom మీటీంగ్ ద్వారా హైద్రాబాద్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల    ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగినది .

SCERT సలహాదారులు ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో విద్యార్థుల ద్వారా ఒక ఐడియా బాక్స్ ఉండాలి, విద్యార్థులుచే  సేకరించిన వినూత్నమైన ఐడియాకు ఇన్ స్పైర్ అవార్డ్ మనకు నామినేట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్. రోహిణి INSPIRE - అవార్డ్ MANAK - 2021 -22 నామినేషన్ ప్రక్రియలో అన్నీ యాజమాన్యాల  పాఠశాలలకు ఐదు నామినేషన్లు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఇందుకు  ఉప విద్యా శాఖాధికారులు,ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి సీ.ధర్మేందర్ రావ్  (చరవాణి : 7799171277 ) లో  సంప్రదించవలసిందిగా DEO  ఆర్. రోహిణి కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు