Ticker

6/recent/ticker-posts

Ad Code

టీకా పై పంజేషా వైద్య బృందం ఇంటింటి అవగాహన

పలు ప్రాంతాల్లో వైద్య బృందం పర్యటన 


హైదరాబాద్,ఆగస్టు 30 (ఇయ్యాల తెలంగాణ) : 

కోవిడ్ టీకా వేయించుకోండి  -  కరోనాను పారద్రోలండి అంటూ చార్మినార్ పరిధిలోని హెల్త్ సిబ్బంది ప్రజల్లో అవగాహనా పెంపొందిస్తున్నారు. సోమవారం ఆరోగ్య డాక్టర్లు, ఆయాలు, ఆశ వర్కర్ల తో కూడిన ప్రతినిధుల బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించి టీకా యొక్క ఆవశ్యకతను వివరించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు. కోవిడ్ టీకా పై ఉన్న అపోహలను విడనాడాలని మనం కరోనా మహమ్మారి మూలంగా ఎంతటి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నామో గుర్తు చేసుకోవాలని వైద్య సిబ్బంది కోరారు. 

త్వరగా టీకా వేయుంచుకోండి  - 


చార్మినార్ పరిధిలోని మొఘల్ పుర, అలీజా కోట్ల, పంజేషా, గుల్జార్ హౌస్, శాలిబండ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లో పర్యటిస్తూ కోవిడ్ టీకా పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. రానా తబస్సుమ్, PHN పద్మ, ANM బాలమణి, ఆశ పూర్ణిమ, అహ్మది,అనూష, రుక్మినీ తదితరులు పాల్గొన్నారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు