Ticker

6/recent/ticker-posts

Ad Code

పవన్‌ అభిమానులకు మరో సర్ప్రైజ్‌

2న బీమ్లా నాయక్‌ టైటిల్‌ సాంగ్‌ విడుదల

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అభిమానులకు ఒక్కో సర్‌ప్రైజ్‌ ఇస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'భీమ్లా నాయక్‌’  చిత్రం ఫస్ట్‌ గింప్స్‌, టీజర్‌తో అలరించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత పక్కా మాస్‌ లుక్‌లో కనిపించిన ఆయన్ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఫస్ట్‌ గ్లింప్స్‌కు వచ్చిన స్పందన, అందులో డైలాగ్‌లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి భీమ్లానాయక్‌ బృందం సిద్ధంగా ఉంది. సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11.16 నిమిషాలకు చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సాగర్‌ కె చంద్ర ట్విట్టర్‌ వేదికగా వెల్లడిరచారు. మండుతున్న రైఫిల్స్‌ ప్రతిధ్వనించ డానికి సిద్ధమవుతున్నాయి. పవర్‌ అంథమ్‌తో పవర్‌డేను సెలబ్రేట్‌ చేసుకుందాం అని ట్వీట్‌ చేశారు దర్శకుడు. మలయాళ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్‌         కె.చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు