Ticker

6/recent/ticker-posts

Ad Code

సోషల్‌ విూడియాలో బన్నీకి పెరుగుతున్న ఫాలోవర్లు

పుష్ప సినిమాతో స్టైలిష్‌ స్టార్‌ నుండి ఐకాన్‌ స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ సోషల్‌ విూడియాలో దూసుకునిపోతున్నాడు. ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా ఏ సామాజిక మాధ్యమైన బన్నీ ఖాతాలో రికార్డ్‌ చేరాల్సిందే. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న పుష్ప పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతుండగా,ఈ సినిమాతో బన్నీ క్రేజ్‌ మరింత పెరగడం ఖాయం అంటున్నారు.’గంగోత్రి’ సినిమాతో కెరీర్‌ మొదలు పెట్టిన అల్లు అర్జున్‌ తనదైన శైలిలో డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తున్నాడు.చివరిగా అల వైకుంఠపురములో అనే సినిమా చేయగా,ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. నాన్‌ బాహుబలి రికార్డ్‌ ఈ చిత్రం తిరగరాయగా, ఇందులోని పాటలు ’బుట్టబొమ్మ, రాములో రాములో రికార్డుల విూద రికార్డులు సృష్టించాయి. మనదేశంతో పాటు విదేశాలలోను ఈ సాంగ్స్‌కి సూపర్భ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాలు, పర్సనల్‌ విషయాలు షేర్‌ చేస్తూ బన్నీతన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 13 మిలియన్స్‌కి పెంచుకు న్నాడు. తెలుగుతో పాటు సౌతిండియాలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరోగా నిలిచారు బన్నీ. అల్లు అర్జున్‌కు తెలుగులో పాటు మలయాళంలో మంచి గుర్తింపే ఉంది. ఇక హిందీ డబ్బింగ్‌ సినిమాలతో అక్కడ ప్రేక్షకులకు కూడా బన్ని దగ్గరయ్యాడు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు