హైదరాబాద్, ఆగస్టు 30 (ఇయ్యాల తెలంగాణ) : రాజకీయంగా సాధికారత ధ్యేయంగా కృషి చేస్తానని తెలంగాణా రాష్ట్ర బేడా బుడ్గజంగం ఐక్యవేదిక చైర్మన్ తూర్పాటి జగదీశ్వర్ అన్నారు.సోమవారం ప్రెస్ క్లబ్ లో తెలంగాణా బేడా బుడ్గజంగం సంఘాల ఐక్యవేదిక చైర్మన్ గా మేడ్చల్ జిల్లా బండ్లగూడకు చెందిన తూర్పాటి జగదీశ్వర్ ఎన్నికైన సందర్బంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గత నలభై ఏళ్లుగా ఆయా ప్రభుత్వాలతో బేడా బుడ్గజంగాల హక్కులకోసం, సమస్యల పరిష్కారాల కోసం చేసిన కృషికి ఫలితంగా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్నకాలంలో బుడ్గజంగాలు రాజకీయంగా సాధికారత పెంపోందెందుకు శాయశక్తుల పోరాడుతానని పేర్కొన్నారు. బుడ్గజంగం కులానికి చెందిన విద్యార్థులకు కేజీ నుంచీ పీజీ వరకూ ఉచిత విద్యఅందించేందుకు ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వస్తామని, అలాగే బుడ్గజంగం కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు పాటుపడతనని చెప్పారు.నిరుపేద బుడ్గజంగాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మూడెకరాల భూమి, ఆత్మ గౌరవ భవనాలు కట్టించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి తర్వాత సాధించేందుకు పూను కొంటానని ఆయన హామీ నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బేడా బుడ్గజంగం కన్ఫడరేషన్ అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసరు డాక్టర్ ఎన్నార్ వెంకటేశం, డాక్టర్ చింతల యాదగిరి,తెలంగాణ బేడా బుడగ జంగం సంక్షేమ సంఘం అధ్యక్షులు, పస్తం యాదయ్య, హక్కులదండు అధ్యక్షులు తూర్పాటి హనుమంతు,తెలంగాణ పిసిసి ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ చిరంజీవి (సంజీవ),ఐక్యవేదిక ఉపాధ్యక్షులు తూర్పాటి పాండు,జంగమ్మెట్ స్థానిక బేడా బుడ్గజంగం సంఘం అధ్యక్షులు నిదానకవి దశరథ,ప్రచారకార్యదర్శి ఇప్ప సత్యనారాయణ, కొతలాపూర్ స్థానిక సంఘం కార్యదర్శి కళ్లెం రమేష్ ప్రభృతులు పాల్గొన్నారు.