హైదరాబాద్, ఆగస్టు 22 (ఇయ్యాల తెలంగాణ) : సరైన సమయంలో సరైన చికిత్స అందించడంతోనే టీబి రోగ నివారణ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర టీబి ఆఫీసర్, జాయింట్ డైరక్టర్ డాక్టర్ ఏ. రాజేశం అన్నారు.శనివారం రాయల్ రివేరా హోటల్ లో బ్రేకింగ్ ది బారియర్స్ NGO సంస్థ అండ్ "టీబి అలర్ట్ ఇండియా" సంయుక్త ఆధ్వర్యంలో "టీబి నివారణ లో మీడియా పాత్ర"పై కార్యక్రమం జరిగింది. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా 2025 సంవత్సరానికల్ల టీబి వ్యాధి పూర్తిగా నివారించే చర్యలను గైకొనడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా పాత్రికేయులు టీబి వ్యాధి కారణాలు రోగి లక్షణాల గురించి తమ తమ పత్రికల్లో ప్రజలకు తెలియజేసేలా కధనాలు, వార్తలు ప్రచురించి తమవంతు సహకారం అందజేయవలసిందిగా వివిధ పత్రికల పాత్రికేయులకు మనవిచేశారు.
తర్వాత డైరక్టర్ ఆఫ్ టీబి కంట్రోల్ ఆఫిసర్ ఎస్. విజయ్ కుమార్ మాట్లాడుతూ, టీబి వ్యాధి గోరు-వెంట్రుకలు తప్ప శరీరంలోని ఏ అవయవా నికైనా సోకవచ్చని, దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించితే సులభంగా నివారణ సాధ్యమవుతుం దని తెలిపారు.కర్ణాటక హెల్త్ ప్రోగ్రాం ఫర్ టీబి (KHPT)డైరక్టర్ సుకీర్తి చౌహన్ మాట్లాడుతూ, మన చుట్టూ పరిసరాలలో టీబి పేషంట్లు మసలుతుంటారనీ అయితే టీబి వ్యాధి సోకిందంటే తమవద్దకు ఎవరూ రారనే న్యూనతా భావాన్ని దూరం చేసేందుకు పత్రికల ద్వారా వార్తలు రాసి ధైర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పిదప టీబీ అలర్ట్ ఇండియా CEO వికాస్ ఫణిబట్ల మాట్లాడుతూ,ప్రతి సంవత్సరం టీబి పేషంట్లు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటిమందిన్యూనత భావనతో చనిపోతున్నారనీ, వారికి సరైన అవగాహన ఉంటే మరణాలు అపవచ్చని మీడియా దాని కోసం పునుకోవాలని ఆకాంక్షించారు. పోలియో మాదిరిగానే సామూహికంగా ఈ టీబి వ్యాధిని నిర్ములించడానికి పత్రికలు తమతోడ్పాటును అందజేసిన టీబి రహిత దేశంగా, రాష్ట్రంగా, జిల్లాగ తీర్చి దిద్దాలని రాష్ట్ర టీబి సెల్ హైదరాబాద్ ఐఈసి ఆఫిసర్ (NTEP)జితేంద్ర పేర్కొన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో టెక్నీకల్ ఆఫిసర్ ఎన్టి ఈపి. వాసు ప్రసాద్,చీఫ్ రిపోర్టర్ సంజీవ్ జోయల్ కుమార్ (ప్రోగ్రాం ప్రొడ్యూసర్) ఇండియా బ్రేకింగ్ బారక్ ఎన్ జీ ఓ జిల్లా కో-ఆర్డినేటర్ పురుషోత్తం,అసిస్టెంట్ కో ఆర్డినేటర్లు నవనీత,అనిల్,పద్మశ్రీ, అశోక్, అంజూమ్, నస్రీన్, వీరమల్లు,పత్రికల విలేకరులు సత్యం, మల్లిఖార్జున్, మక్బుల్ కమ్యూనిటీ లీడర్లు డాక్టర్ శ్రీవాటి శ్రీనాథ్,జావీద్ లు పాల్గొన్నారు.టీబి అలర్ట్ ఇండియా ప్రోగ్రాం డైరక్టర్(హైదరాబాద్) రమేష్ దాసరి ఈ సమావేశకర్తగా వ్యవహారించారు.