Ticker

6/recent/ticker-posts

Ad Code

హాలీవుడ్‌ నిర్మాతగా ..దీపికా కొత్తరోల్‌

స్టార్‌ హీరోయిన్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్న దీపికాపదుకొనే  నిర్మాతగానూ తన ప్రతాపం చూపబోతోంది.  స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తూ..చెన్నై ఎక్స్‌ప్రెస్‌, ప్రేమ్‌ లీలా, పద్మావత్‌ లాంటి చిత్రాల్లో తన యాక్టింగ్‌ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ట్రిపుల్‌ ఎక్స్‌ రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్‌ సినిమాతో హాలీవుడ్‌ లోకి కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరో హాలీవుడ్‌ ప్రాజెక్టుతో ప్రేక్షకులను పలుకరించబోతుందన్న వార్త ఇపుడు బీటౌన్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. అయితే ఈ సారి హీరోయిన్‌ గా కనిపించడమే కాకుండా హాలీవుడ్‌ చిత్రానికి నిర్మాతగా కూడా మారబోతుందని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తాజా అప్‌ డేట్‌ ప్రకారం ఎస్‌టీఎక్స్‌ ఫిలిమ్స్‌, టెంపుల్‌ హిల్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీపికా సొంత బ్యానర్‌ కా ప్రొడక్షన్‌ ఈ చిత్రాన్ని కోప్రొడ్యూస్‌ చేయనుంది. ఈ వార్తతో దీపికా పదుకొనే ఫాలోవర్లు, అభిమానులు చాలా ఎక్జయిటింగ్‌ కు లోనవుతున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొనే హిందీలో శకున్‌ బత్ర డైరెక్షన్‌ లో ఓ సినిమాలో నటిస్తోంది. భర్త రణ్‌ వీర్‌ సింగ్‌ తో కలిసి 83 మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది దీపికా. షారుక్‌ ఖాన్‌ హీరోగా వస్తున్న పఠాన్‌ చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ చేస్తోంది. నాగ్‌ అశ్విన్‌`ప్రభాస్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కేలో నటిస్తోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు