Ticker

6/recent/ticker-posts

Ad Code

టెన్త్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

పరీక్షలపై తొలిగిన  ఉత్కంఠ




రంగారెడ్డి, హైదరాబాద్‌ మినహా అంతటా పరీక్షలు 
సప్లింమెంటరీ సమయంలో ప్రాంతాల  వారికి పరీక్షలు 
పంజాబ్‌ తరహాలో పరీక్షలు  లేకుండా గ్రేడింగ్ ‌ ఇవ్వాలన్న పిటిషనర్లు
హైదరాబాద్‌,జూన్‌6(ఇయ్యాల తెలంగాణ): తెలంగాణలో పదో తరగతి పరీక్షల  నిర్వహణకు హైకోర్టు గ్రీన్ ‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు  నిర్వహణకు అనుమతిని ఇచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల  పరిధిలో పరీక్షలను వాయిదా వేసింది. జీహెచ్‌ఎంసి  పరిధిలోని విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు  సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖను న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు  వేర్వేరుగా దాఖలు  చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ సందర్భంగా హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తాజా తీర్పుతో పరీక్షల  నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల  మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయనుంది.పదో తరగతి పరీక్షల  నిర్వహణపై హైకోర్టులో శనివారం కూడా విచారణ జరిగింది. పంజాబ్‌ తరహాలో పరీక్షలు  లేకుండా విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ వాదించారు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల  విూద దృష్టి పెడుతోందని, అయితే, రోజురోజుకూ కరోనా కేసులు  పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్‌ వాదించారు. పంజాబ్‌ తరహాలో పరీక్షలు  లేకుండానే విద్యార్థులకు గ్రేడిరగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ వాదించారు. పరీక్షలు  లేకుండా గ్రేడిరగ్‌ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులను రెగ్యుర్‌గా గుర్తించాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం జీవో విడుద చేసింది. ఈ నిర్ణయాన్ని అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ హైకోర్టుకు నివేదించారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. అలాగే, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు  నిర్వహించాలని హైకోర్టు సూచించింది. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షు నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందన్నారు. అయితే, విద్యార్థుల  ప్రాణాలు  ముఖ్యమా.. సాంకేతిక అంశాలు  ముఖ్యమా అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై  ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం చెబుతామని హైకోర్టుకు ఏజీ తెలపడంతో విచారణ వాయిదా పడిరది. మొత్తంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షల  నిర్వహణపై హైకోర్టు వేదికగా ఉత్కంఠ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు  వేర్వేరుగా దాఖు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డిలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరీక్షలు  నిర్వహంచడం సాధ్యమవుతుందా అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పంజాబ్‌ తరహాలో పరీక్షలు  లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ వాదించారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. అసలు  పరీక్షలు  నిర్వహించకుండా విద్యార్థులకు గ్రేడిరగ్‌ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అని ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని కోరింది. పరీక్షలు  లేకుండా గ్రేడింగ్‌ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ధర్మాసనం ప్రశ్నకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు  నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏజీ వాదనపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. విద్యార్థుల  ప్రాణాలు  ముఖ్యమా..సాంకేతిక అంశాలు  ముఖ్యమా అని ప్రశ్నించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని అడిగి పూర్తి వివరాలను తెలియజేస్తానని సమాధానమిచ్చారు. ఇక కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలు  రాసేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు  ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగే సప్లిమెంటరీలో పరీక్షలు  రాస్తే వార్షిక పరీక్షకు హాజరైనట్లుగా పరిగణిస్తారా లేదా అని ధర్మసనం అడగ్గా.. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు నివేదించారు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు