అయితే సర్వం అన్నింటికి నిర్మాతలను బాధ్యుడిని చేస్తూ స్టిక్ట్ రూల్స్ పెట్టింది.
తాజాగా ప్రభుత్వం జీవో విడుద చేసింది. మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది.
లాక్ డౌన్ నిబంధనలు అనుసరిస్తూ షూటింగ్ కు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలివీ..
- అన్నిటికి బాధ్యత వహిస్తూ ప్రొడ్యూసర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి..
- నటీనటులు సిబ్బంది ఆరోగ్య భాద్యత నిర్మాతదే
- ప్రతి రోజూ ఉదయాన్నే భౌతికదూరం గురించి చిత్ర యూనిట్ కు వివరించాలి
- షూటింగ్ ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి
- మేకప్ ఇంటి వద్దే వేసుకునే వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
- చిన్న పిల్లలు వయసు మీద పడిన వారు షూటింగ్స్ లో పాల్గొనాలంటే డాక్టర్ అనుమతి.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
- ఇండోర్ షూటింగ్ కే ప్రాధాన్యత ఇవ్వాలి
- 40 మంది కంటే ఎక్కువ మంది లేకుండా చూసుకోవాలి.
- ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ప్రాంతాల్లో తప్పనిసరిగా శానిటైజర్ హ్యాండె వాష్ అందుబాటులో ఉంచాలి
- ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి
- కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్‌లు చేయకూడదు
- వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ లు జరపకూడదు
- మేకప్ వేసుకున్నా ఆర్టిస్టు ఫేస్ షీల్డ్ ను ఉపయోగించాలి
- మేకప్ ఆర్టిస్టు హెయిర్ డ్రస్సర్లు పీపీఈ కిట్లు ధరించాలి
- పెద్ద సినిమాకి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి
- సగం పూర్తయిన సినిమాలు టీవీ సీరియళ్ల షూటింగ్ కు మాత్రమే అనుమతి
- ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరి
- షూటింగ్ లో మాస్క్ భౌతికదూరం మస్ట్
- షూటింగ్ ఏరియాలో పాన్ సిగరెట్లు నిషేధం
- షూటింగ్ ఏరియాలో తప్పనిసరిగా డాక్టర్ ఉండాల్సిందే
- కార్లను శానిటైజ్ చేసిన తర్వాతే ఆర్టిస్టు దగ్గరికి పంపాలి
- నటీనటుల ఎంపిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగాలి