Ticker

6/recent/ticker-posts

Ad Code

కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న తల్లి దండ్రులు - కులమే కారణమా ?

డిగ్రీ చదువుతూ ప్రేమ కలాపాలు 

యువకుడితో సాన్నిహిత్యంతో గర్భం దాల్చిన యువతి

తట్టుకోలేక కూతురు ప్రాణాలు  తీసిన తల్లిదండ్రులు 

గద్వాల,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ): తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. వేరే కులానికి అంటే వారి దృష్టిలో తమ కంటే తక్కువ కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించినందుకు కన్న తల్లితండ్రులే సొంత కుమార్తెను దారుణంగా హత్య చేశారు. డిగ్రీ చదువుతున్న కుమార్తె గర్భం దాల్చిందని తెలిసిన  తల్లిదండ్రులు  తలదించుకునే పరిస్థితి రావడంతో  ఆగ్రహంతో కూతురిని చంపేశారు. పోలీసులు  తెలిపిన వివరాల  ప్రకారం.. గద్వాల  జిల్లా మానవపాడు మండలం కల్లు కుంట్లకు  చెందిన భాస్కర శెట్టి, వీరమ్మ దంపతులకు ముగ్గురు కుమారైలు. వీరిలో ఒక కుమార్తె (20 ) ఏపీలోని కర్నూలు  పట్టణంలోని ఓ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. తోటి విద్యార్థి అయిన ఓ యువకుడిని ప్రేమించింది. మార్చ్‌లో లాక్‌డౌన్‌కి రెండు రోజుల  ముందు ఇంటికి వచ్చింది. ఆ యువతిని తల్లిదండ్రులు  శనివారం నాడు వైద్య పరీక్షల  కోసం ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఆమె గర్భంతో ఉందని పరీక్షలో నిర్దారణ కావటంతో అబార్షన్‌ చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో వారు ఆమెను తీసుకొని ఇంటికి వచ్చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక యథావిధిగా మిగిలిన ఇద్దరు కుమార్తెలతో ఆరు బయట నిద్రపోయారు. పోలీసులు  తెలిపిన వివరా ప్రకారం ఆదివారం త్లెవారు జామున సుమారు రెండు గంట సమయంలో.. భాస్కర శెట్టి, వీరమ్ము తమ కూతురిని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. కూతురు చదువుకుంటానని వెళ్లి గర్భంతో రావడంతో వారు తట్టుకోలేక పోయారు. చదువుకుని ప్రయోజకురాలు  అవుతుందనుకున్న సమయంలో ఇలా చేయడంతో ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందో అన్న ఆందోళనలో వారు సొంత బిడ్డను పొట్టన పెట్టుకున్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు