Ticker

6/recent/ticker-posts

Ad Code

మమతా పై అమిత్ షా ఫైర్ - వలస కూలీలను అవమానిస్తే ఊరుకోము


వలస కూలీలను అవమానించిన మమతా
వర్చువల్‌ ర్యాలీలో మండిపడ్డ అమిత్‌ షా

న్యూఢిల్లీ,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ):  వలస కూలీలను తరలించే శ్రామిక్‌ రైళ్లను కరోనా ఎక్స్‌ప్రెస్‌ అని పేరు పెట్టిన దీదీపై అమిత్‌ షా ఫైర్‌ అయ్యారు. కరోనా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లే విూ రాజకీయ జీవితానికి చరమగీతం పాడనున్నట్లు షా హెచ్చరించారు. ఎంతో ఇబ్బందుల్లో ఉన్న  వలస కూలీలను మమతా బెనర్జీ కించపరిచిందన్నారు.  వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేత అమిత్‌ షా ప్రచారం మొదలు పెట్టారు.  ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జన్‌ సంవాద్‌ ర్యాలీలో ప్రసంగించారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై షా తీవ్ర విమర్శలు  చేశారు.శ్రామిక్‌ రైళ్లను నడుపుతూ వైరస్‌ వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వం కారణమైందని మమతా ఇటీవల  ఆరోపించారు. వర్చువల్‌ సభలో బీజేపీ వర్కర్లతో మాట్లాడిన అమిత్‌ షా.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన మమతా బెనర్జీ భారీ మ్యూల్యం  చెల్లించాల్సి ఉంటుందన్నారు. బెంగాల్‌ ప్రజలే మమతా బెనర్జీని రాజకీయ శరణార్థిగా మారుస్తారని ఆయన విమర్శించారు. లాలుచీ రాజకీయాలను అంతం చేసేందుకు సీఏఏ సమర్థవంతమైనదని, బెంగాల్‌ ప్రజలు  దీని గురించి తెలుసుకోవాలన్నారు. దశాబ్దాలుగా శరణార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ చట్టం అడ్డుకుంటుందని షా అన్నారు.   దేశవ్యాప్తంగా అంతటా ప్రజాస్వామ్యం వెల్లి విరుస్తుంటే, ఒక్క బెంగాల్‌లో మాత్రమే రాజకీయ హింస తారాస్థాయికి చేరిందన్నారు. హింస రాజకీయాలను బెంగాల్‌ సీఎం ప్రోత్సహిస్తున్నట్లు షా ఆరోపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు