Ticker

6/recent/ticker-posts

Ad Code

పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి - కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే సీతక్క


మహబూబాబాద్‌,జూన్‌11(ఇయ్యల తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములను టీఆర్‌ఎస్‌ గుంజు కుంటుందని ములుగు ఎమ్మెల్యీ సీతక్క ఆరోపించారు. పోడు భూముల  సమస్యలను పరిష్కరించడంలో సిఎం కెసిఆర్‌ ఇంత వరకు హావిూని నిలబెట్టుకోలేదని అన్నారు. ఈ సమస్యను తక్షణం పరిస్కరించాలంటూ జిల్లా కలెక్టర్‌  వి.పి.గౌతమ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సీతక్క మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు కానీ  పేదలు  నివాసాలు  ఏర్పర్చుకున్న ఉన్న భూములను గుంజు కుంటుందని విమర్శించారు. 1940, 1960సంవత్సరాల  మ్యాప్‌తో అటవీశాఖ అధికారులు  పోడు భూములలో ట్రెంచ్‌లు  కొడుతున్నారని మండిపడ్డారు. ఏ భూమిలో ఏ పంట పండుతుందో పండించే రైతుకు తెలుసు కానీ ప్రభుత్వానికి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. పంట మద్దతు ధరను రాష్ట్ర  ప్రభుత్వం ముందే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులైన ఎంపీ, మంత్రి పోడు భూములకు పట్టాలు  ఇప్పించాలని ఎమ్మెల్యే సీతక్క పట్టుబట్టారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు