హైదరాబాద్,జూన్10(
ఇయ్యాల తెలంగాణ): ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అయిన భాగ్యనగర వాసులకు కాస్త ఊరట లభించింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బాలానగర్, బోయిన్‌పల్లి, సనత్‌నగర్, చింతల్‌లోనూ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, మెహిదీపట్నంతో పాటు మేడిపల్లి, ఉప్పల్, రామంతాపూర్‌లో కూడా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపై నీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇటు పాతనగరంలోని పలు చోట్ల తొలకరి జల్లులు పడ్డాయి.వర్షం కారణంగా గౌలిపురా,లాల్ దర్వాజ,ఉప్పుగూడ ,కందికల్ గేట్,ఛత్రినాక, లలితాబాగ్,పటేల్ నగర్, అంబికా నగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే బుధవారమే కాదు గురువారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.