Ticker

6/recent/ticker-posts

Ad Code

గ్రేటర్‌లో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు


వరుస పాజిటివ్‌ కేసులతో బెంబేలెత్తుతున్న జనాలు 

మరోమారు లాక్‌డౌన్‌ తప్పదంటూ పుకార్లు షికారు
హైదరాబాద్‌,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ): గ్రేటర్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ ఎవరి ద్వారా వ్యాప్తి చెందుతుందో అన్న భయం నెలకొంది. అలాగే కాంట్రాక్ట్‌ను గుర్తించడం కూడా కష్టంగా మారింది. దీంతో గతవారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు  నమోదవుతునే ఉన్నాయి. చివరకు జిహెచ్‌ఎంసి, సచివాలయ ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో ఉద్యోగుల్లో సైతం భయం నెలకొంది. దీంతో చాలామంది మళ్లీ విధులకు రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నగరంలో మరోమారు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం సాగుతోంది. గ్రేటర్‌ పరిధిలో పెరుగుతున్న కేసులతో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు  ఉన్నాయని అంటున్నారు. టెన్త్‌ పరీక్షలు  కూడా పూర్తిగా రద్దు కావడంతో ఇక లాక్‌డౌన్‌ విధించినా పెద్దగా సమస్యలు  రావని అంటున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు  ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. ప్రజలు  వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలూ  ఉన్నాయి. అందుకే కేసులు  పెరుగుతున్నాయని అంటున్నారు. సోమవారం కింగ్‌కోఠి ఆస్పత్రి  ఓపీకి 202 మంది రోగులు  రాగా, వీరిలో 32 మందిని ఇన్‌ పేషంట్లుగా అడ్మిట్‌ చేశారు. ఇప్పటికే ఇక్కడ చికిత్స పొందుతున్న 24 మందికి వ్యాధి నిర్దారణ పరీక్షలు  నిర్వహించగా, వీరిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. నెగిటివ్‌ వచ్చిన 18 మందిని డిశ్చార్జ్ ‌ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 88 మంది అనుమానితులు  ఉన్నారు. 

కరోనా అనుమానిత క్షణాలతో బాధపడుతూ ఫీవర్‌ ఆస్పత్రికి 56 మంది రాగా, వీరిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రి  ఐసోలేషన్‌ వార్డులో ఉన్న 13 మందికి పాజిటివ్‌ నిర్దారణ అయింది. మరో 64 మంది అనుమానితును ఐసోలేషన్‌లో ఉంచారు. కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయి స్వల్ప  లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 393 మందిని డిశ్చార్జ్‌  చేసి, హోం క్వారంటైన్‌కు తరలించారు. నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో సోమవారం 54 కోవిడ్‌19 అనుమానిత కేసులు  నమోదయ్యాయి. కోవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు  నిర్వహించి కోవిడ్‌ లక్షణాలు  కనిపించిన వారిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. పాత కేసుతో కలిపి ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డులో 64 మంది అనుమానితులు  వైద్యుల  పర్యవేక్షణలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం నమోదైన అనుమానితుల్లో మొత్తం 13 మందికి పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 


బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. సయ్యద్‌నగర్‌కు చెందిన మహిళ(37) తల్లికి వారం రోజుల  క్రితం కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల  డిశ్చార్జి అయింది. సోమవారం ఆమె కుమార్తెకు కరోనా పాజిటివ్‌ రావడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎంపీ మురళీమోహన్‌ కుమారుడి ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇద్దరు భార్యా, భర్తలు  కాగా మరో మహిళ వంట మనిషిగా పని చేస్తోంది. టోలిచౌకికి చెందిన వృద్ధుడికి(75), బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లో నివాసం ఉంటున్న మరో యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి (49)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. శివాజీనగర్‌కు చెందిన వ్యక్తి గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఉస్మానియా ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు  నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. దీంతో శివాజీనగర్‌లోని అతడి కుటుంబసభ్యులను అధికారులు  హోం క్వారంటైన్‌ చేశారు. యూసుఫ్‌గూడ సర్కిల్‌ 19 పరిధిలో ఇద్దరు వ్యక్తులు  కరోనా బారిన పడ్డారు. జవహర్‌నగర్‌ బస్తీకి చెందిన యువకుడు(27),  హైలాం కానీకి చెందిన వ్యక్తి (54)కి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. శేరిలింగంపల్లి మండల  పరిధిలో సోమవారం మూడు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి. సుదర్శన్‌ నగర్‌ కాలనీకి చెందిన మహిళ (46), మియాపూర్‌ న్యూకాలనీకి చెందిన యువకుడు(26), ఇజ్జత్‌ నగర్‌కు చెందిన వ్యక్తి( 35) కరోనా బారిన పడ్డారు. విూర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో సోమవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి. ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కాలనీకి చెందిన మహిళ(45)కు, జిల్లెగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి (35) కరోనా పాజిటివ్‌ రావడంతో వారి ఇళ్లను క్వారంటైన్‌ చేశారు. కిషన్‌బాగ్‌ డివిజన్‌లోని అసద్‌బాబానగర్‌లో ఓ వృద్ధుడి (65)కి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. బహదూర్‌పురా పీఎస్‌లో కానిస్టేబుల్‌కు (52)కు కూడా ఆదివారం రాత్రి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో సోమవారం మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి.
ఆదివారం రాంనగర్‌ విూ సేవా వద్ద నిమ్స్‌లో పనిచేసే ఓ నర్సుకు కరోనా సోకగా, సోమవారం ఆమె సోదరికి పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. కవాడిగూడకు చెందిన మహిళ(34)  గాంధీనగర్‌లో (65) ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఉస్మానియా ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తూ ఫ్రెండ్స్‌కానీలో ఉంటున్న యువకుడి(24)కి, భోలక్‌పూర్‌లో ఓ వ్యక్తికి (53, అడిక్‌మెట్‌ లలితానగర్‌లో మరో వ్యక్తి(48)కి పాజిటివ్‌ వచ్చింది. బీర్బన్‌ గల్లీలో ఉంటున్న హౌస్‌ సర్జన్‌(26)కు, భోలక్‌పూర్‌కు చెందిన (52) వ్యక్తికి, లలితానగర్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి కరోనా బారిన పడ్డారు. కూకట్‌పల్లి సర్కిల్‌లో బిల్ కలెక్టర్‌గా విధులు  నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు  సదరు బిల్ కలెక్టర్‌కు ఎవరి నుంచి వ్యాధి సోకిందనే వివరాలు  సేకరిస్తున్నారు. మిర్జాల్‌గూడ రాజా శ్రీనివాస్‌నగర్‌కు చెందిన వైద్యుడికి (30) కరోనా నిర్దారణ అయ్యింది. అతను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో విధులు  నిర్వహిస్తున్నట్లు అధికారులు  తెలిపారు.
 
రెండు నెలల  పాటు తగిన జాగ్రత్తలు పాటించండి. అసద్ 
 
ఇదిలావుంటే కరోనా విస్తరించే ప్రమాదం ఉన్నందున కనీసం రెండునెలల  పాటు తగిన జాగ్రత్తలు  తీసుకోవాలని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సూచించారు. యువ జర్నలిస్ట్‌ మరణం తనను కచివేసిందని.. వృత్తి ధర్మం కోసం తన ప్రాణాన్నే త్యజించాడని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. జర్నలిస్ట్‌ కుటుంబీకులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని కోరుతున్నానన్నారు. జర్నలిస్టులు  తగిన జాగ్రత్తలు  తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టులకు ఏదైనా సాయం కావాంటే తనను సంప్రదించాని అసదుద్దీన్‌ సూచించారు.   

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు