Ticker

6/recent/ticker-posts

Ad Code

హైదరాబాద్‌లో బోనాల పండగ రద్దు

.హైదరాబాద్‌ పరిధిలో బోనాల నిర్వహణపై జరిగిన సవిూక్ష అనంతరం మాట్లాడుతున్న మంత్రి  తలసాని శ్రీనివాసయాదవ్‌. చిత్రంలో మేయర్‌ బొంతు రామ్మోమన్‌ తదితరులు  ఉన్నారు

ఇంటికే పరిమితం కావాలన్న మంత్రి తలసాని
హైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ): కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో బోనాల  పండగను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌లో కరోనా కేసులు  విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజల  ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. దీనికి నగర ప్రజలు  సహకరించాలని కోరారు. బోనాల  పండగ చేసుకోవాలా, వద్దా అనే అంశంపై ఆయనతోపాటు నగర మంత్రులు, ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ అధికారులు సవిూక్ష నిర్వహించారు. తర్వాత తలసాని విూడియాతో మాట్లాడుతూ గుళ్లలో పూజరులు  మాత్రమే బోనాలు  పెడతారని, ప్రజలు ఇళ్లకే పరిమితమై పండగ చేసుకోవాలని సూచించారు. అమ్మవార్లకు పట్టుబట్టల  సమర్పణతోపాటు ఘటాల  ఊరేగింపు కూడా పూజారులే నిర్వహిస్తారని చెప్పారు. సవిూక్షా సమావేశంలో మంత్రులు  మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తదితరులు  పాల్గొన్నారు.

.హైదరాబాద్‌ పరిధిలో బోనాల  నిర్వహణపై జరిగిన సవిూక్షలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌. చిత్రంలో మంత్రులు  మహ్మూద్‌ అలీ, మల్లారెడ్డి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి  తదితరులు  ఉన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు