Ticker

6/recent/ticker-posts

Ad Code

చైనా దూకుడుకు భారత్ ధీటైన వ్యూహం

చైనా దూకుడుకు భారత్ ధీటైన వ్యూహం 


సరిహద్దల్లో ఎమర్జెన్సీ ఎయిర్‌స్టిప్ట్ర్‌ నిర్మాణం
న్యూఢిల్లీ ,జూన్‌4(ఇయ్యాల తెలంగాణ): సరిహద్దుల్లో డ్రాగన్‌ కంట్రీ ఎగరెగిరిపడుతున్న వేళ అందుకు దీటుగా భారత్‌ స్పందిస్తోంది. ఎమర్జెన్సీ ఎయిర్‌స్టిప్ట్ర్‌ నిర్మించే పనిలో భారత్‌ పడిది. కరోనా పాపం విూదేనంటూ ప్రపంచమంతా నిందిస్తున్న వేళ.. దాని నుంచి దృష్టి మరల్చేందుకు భారత సరిహద్దులో కావాని కయ్యానికి కాలు దువ్వుతుంది. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి భారత్‌ను రెచ్చగొడుతోంది. ఐతే ఇండియన్‌ ఆర్మీ సైతం చైనాకు ధీటుగా బలగాల్ని మోహరించింది. ఐతే చైనాకు చెక్‌ పెట్టే దిశగా భారత్‌ కీలక అడుగు ముందుకేసింది. దక్షిణ కాశ్మీర్‌లో ఎమ్జ్గంªన్సీ ఎయిర్‌ స్టిప్ర్‌ నిర్మాణాన్ని ప్రారంభించింది. అనంత్‌ నాగ్‌ జిల్లా బిజ్‌ బెహారా ప్రాంతంలో 3.5 కి.విూ. మేర ఈ అత్యవసర ఎయిర్‌స్టిప్ర్‌ను నిర్మిస్తున్నారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఔఊంఎ) ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇది పూర్‌ఖ్తెతే ఆర్మీకి అవసరమైన సామాగ్రి, ఆయుధాల  తరలింపు మరింత సులభతరం అవుతుంది. అంతేకాదు బార్డర్‌లో చైనా కయ్యానికి వస్తే.. నేరుగా యుద్ధ విమానాలను రంగంలోకి దింపి ధీటుగా జవాబు ఇవ్వవచ్చు. ఆ వ్యూహంతోనే ఇక్కడ ఎమర్జెన్సీ ఎయిర్‌ స్టిప్ర్‌ నిర్మిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు