Ticker

6/recent/ticker-posts

Ad Code

భక్తులకు దర్శన మివ్వనున్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు



భక్తులకు  దర్శనమివ్వనున్న  చార్మినార్  భాగ్యలక్ష్మి అమ్మవారు 
హైదరాబాద్ జూన్ 7 (ఇయ్యాల తెలంగాణ

చార్మినార్ భాగ్యలక్ష్మి (మైసమ్మ) దర్శనాలు రేపటి నుంచి అనగా  సోమవారం  ఈ నెల 8 వ తేదీ నుంచి కల్పించ నున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. కరోనా ను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల జాగ్రత్తలతోనే భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి కల్పించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. చిన్న పిల్లలు,వృద్దులు ఇంట్లో నుంచే అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. అమ్మవారి దర్శనం కోసం  వచ్చే భక్తులు కూడా తగిన జాగ్రత్తలతోనే అమ్మవారి దర్శన భాగ్యం పొందాలని కోరారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని కోరారు. సాంఘిక దూరాన్ని కూడా పాటిస్తూనే అమ్మవారి కృపను పొందాలని తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల జాగ్రత్తలతో ఏర్పాటు చేసిన చేసిన సూచిక బోర్డులు,బారీకేడ్లు 

 ఇక్కడకు విచ్చేసే భక్తులందరు ఇట్టి విషయాల్లో సహకారం అందించాలని కోరారు. అదేవిధంగా అమ్మవారికి ఎలాంటి పూలు,పండ్లు లాంటివి తేవడం నిషేదించ బడినవని తెలిపారు. దేవాలయం పరిసరాల్లో కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరగదని పేర్కొన్నారు. కరొనను దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలతో భక్తులకు  ఎలాంటి అసౌక్యరం కలుగకుండా చూస్తున్నామని భక్తులు కూడా ఆలయ కమిటీ సభ్యులకు సహకరించాలని కోరారు.    

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు