హైదరాబాద్,జూన్10(ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో బుధవారం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. జూడాల డిమాండ్లపై మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారు. ఆందోళన విరమించిన జూడాలు విధుల్లో చేరుతున్నారు. ప్రధానంగా ఐదు డిమాండ్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. డాక్టర్లతో మంత్రి ఈటల సమావేశం అయ్యారు. గాంధీ హాస్పిటల్‌లో డాక్టర్‌ల పై దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతున్న వేళ వారితో మంత్రి ఈటెల రాజేందర్ నేరుగా చర్చలకు దిగారు. వారికి అండగా ప్రభుత్వం ఉందని హావిూ ఇచ్చారు. ఉదయం నుంచి హాస్పిటల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జూనియర్ డాక్టర్లను ఆందోళన విరమించాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు . మాట్లాడేందుకు ప్రతినిధి బృందం సెక్రటేరియట్‌కు రావాలని కోరారు. కానీ మంత్రి విజ్ఞప్తి పై స్పందించ లేదు. తాము సీఎంనే కలుస్తామని తెగేసి చెప్పారు. మంత్రితో చర్చించేందుకు సెక్రటేరియట్ కు వెళ్లలేదు. దీంతో స్వయం గా మంత్రి ఈటల గాంధీ మెడికల్ కాలేజ్‌కు వెళ్లారు.
జూడాలతో మంత్రి ఈటెల చర్చలు సఫలం
బుధవారం, జూన్ 10, 2020
0