శుక్రవారం లక్ష్మికి ప్రీతిపాత్రం (ఆధ్యాత్మికం)
ఇయ్యాల తెలంగాణ - ఆధ్యాత్మిక కాంతి
శుక్రవారం లక్ష్మికి ప్రీతిపాత్రం. ఆమెను శ్రద్దగా పూజిస్తే డబ్బుకు కొదవ ఉండదన్నది మన నమ్మకం. వేకువజాముననే ఇల్లంతా శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టి, పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపును ఉపయోగించడం వల్ల కొన్ని ఉపయోగకరాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా ఇంట్లో ఎప్పుడు డబ్బుకు కొదవ ఉండదు. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం సొంతమవుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి అశుభం జరగకుండా ఆర్థిక సమస్యకు పరిష్కార మార్గాలను చూపుతుంది. పసుపు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పవిత్రతకు చిహ్నం మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. పసుపు శుభానికి చిహ్నం..జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపును వృద్ధికారకంలా చూస్తారు. అందుకే వివాహాది శుభకార్యలప్పుడు వధువు తల్లి దండ్రులు ఆమెకు అల్లుడితో పాటు పసుపును బహుమతిగా అందిస్తారు. అంతేకాకుండా అత్తింటి వారింట్లో ఆయురారోగ్యఐశ్వర్యాలతో సంతోషాన్ని వ్యాప్తి చెందించాలని ఇస్తారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తున్నప్పటికీ ఎక్కువ మొత్తంలో డబ్బు నిల్వ ఉండది. అంతేకాకుండా సంపాదించే వనరులు ఎక్కువగా ఉన్నప్పటికీ పొదుపు, ఇతరు ఖర్చుల పేరిట డబ్బు తక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి నల్ల పసుపును నివారణకు వాడండి. ఫలితంగా ఎక్కువ డబ్బు సంపాదించుకునేందుకు అవకాశముంటుంది.
Add caption |
అంతేకాకుండా పసుపు వృద్ధిని పెంపొందిస్తుందని అంటారు. పసుపుకుంకుమలతో పూజలు చేయడం ద్వారా ఏడాది పొడవునా లక్ష్మీ దేవి ఆశీర్వదాలు విూ మీద ఉండి ఆమె కృప ఎల్లవేళలా ఉంటుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా ఐశ్వర్యం ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, పసుపుకు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి పసుపు కొమ్మును ధరించడం వల్ల బలం పెరుగుతుంది. పసుపు దండను పట్టుకొని గురు గ్రహం మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో చాలా ప్రయోజనాలు వస్తాయి. కుండలిలో గురు బలహీనంగా ఉన్నసమయంలో పసుపు ముక్కను ఒక గుడ్డలో పెట్టి చేతికి కట్టుకుంటు గురుడు ఆశీర్వాదం పొందుతారు. అంతేకాకుండా జీవితంలో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.
లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం శ్రేష్ఠమైనది. అందుకే ఈ రోజు శుచిగా,భక్తితో అమ్మవారికి పూజ చేయడం ద్వారా సంకల్పాన్ని పొందుతారు.