 |
చిత్ర గుప్త దేవాలయానికి శానిటైజ్ మెషిన్ బహుకరిస్తున్న కార్పొరేటర్ అబ్దుల్ రహమాన్
|
హైదరాబాద్ జూన్ 8 (
ఇయ్యాల తెలంగాణ )
కందికల్ గేట్ లోని చిత్రగుప్త దేవాలయానికి వచ్చే భక్తులు కరోనా మహమ్మారి భారిన పడొద్దని ఉదేశ్యంతో జంగమ్మెట్ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ శానిటైజ్ స్కానర్ మిషన్ ను దేవాలయానికి బహుకరించారు. ఎం ఐ ఎం పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఆదేశాల మేరకు జంగమ్మెట్ డివిజన్ పరిధిలో ఎవరు కూడా కరోనా కు గురి కావొద్దనే ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉండాలని పార్టీ కోరుకుంటుందని కోరారు. కుల మతాల కతీతంగా దేవాలయానికి శానిటైజ్ స్కానర్ ఇవ్వడంతో భక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సభ సభ్యులు ఖాజా షరీఫ్ బాబా ఏస్సే డెవెలప్మెంట్ అధ్యక్షులు పులికంటి నరేష్ చిత్రగుప్త దేవాలయ చైర్మన్ మోహన్ రెడ్డి, సరస్వతి శిశుమందిర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు