Ticker

6/recent/ticker-posts

Ad Code

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ సినిమా లైన్ క్లియర్

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ సినిమా లైన్ క్లియర్

 

ఇయ్యాల తెలంగాణ మే 4 సినిమా ప్రతినిధి :
ఈరోజు కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ పుట్టినరోజు. ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే గత కొద్దికాలాంగా ప్రశాంత్‌ నుండి తన తదుపరి సినిమా గురించి ఏదైనా అప్డేట్‌ వస్తుందేమో.. అని ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ తో పాటు టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కూడా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారంటే ఓకే.. కానీ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎందుకు ఎదురు చేస్తున్నారనేది ఆసక్తికరమైన విషయం.
 ఎందుకంటే ఎన్టీఆర్‌ పుట్టిన రోజున డైరెక్టర్‌ ప్రశాంత్‌.. త్వరలోనే ఎన్టీఆర్‌ తో సినిమా ఉంటుందని ఇండైరెక్ట్‌ గా హింట్‌ ఇచ్చాడు. ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందని కూడా వార్తలు  వినిపించాయి. ఇక అప్పటి నుండి ఎన్టీఆర్‌ తో మూవీ ఉంటుందని ఇండస్ట్రీలో అభిమానులు  రచ్చ చేశారు. ఆ తర్వాత మళ్లీ డైరెక్టర్‌ ప్రశాంత్‌.. ప్రస్తుతం కేజీఎఫ్‌2 మీద మాత్రమే ఫోకస్‌ పెట్టానని చెప్పడంతో అంతా సైలెంట్‌ అయిపోయారు.
మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే విషెస్‌ చెప్పిన ప్రశాంత్‌ నీల్‌.. ఈసారి రేడియేషన్‌ సూట్‌ తో వస్తానని.. అలాగే త్వరలో కలుద్దాం అని ప్రశాంత్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఈరోజు ప్రశాంత్‌ బర్త్‌ డే కావడంతో అభిమానులు  మళ్లీ ఎన్టీఆర్‌ సినిమా గురించి ఏదైనా అప్డేట్‌ ఇస్తారేమో అని వెయిట్‌ చేస్తున్నారు. అయితే ప్రశాంత్‌ బర్త్‌ డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్‌ వారు చేసిన ట్వీట్‌ చూస్తే ఎన్టీఆర్‌ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్‌ వారు.. ‘‘త్వరలోనే రేడియేషన్‌ సూట్‌ తో ప్రశాంత్‌ ని కలవడానికి సిద్ధంగా ఉన్నాం..’’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ తో ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ సినిమా దాదాపు ఖాయమే అనిపిస్తుంది. ఈసారి కూడా భారీ యాక్షన్‌ సినిమాతో ప్రశాంత్‌ రానున్నట్లు తెలుస్తుంది. అన్నీ కుదిరితే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో షురూ కానుందని సినీ వర్గాల  టాక్‌. కానీ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ లో మాత్రం ఈ వార్త బూస్ట్‌ నింపిందని చెప్పాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు