Ticker

6/recent/ticker-posts

Ad Code

కేజ్రీవాల్‌ రక్తనమూనాల సేకరణ - కరోనా పరీక్షల ఫలితం రేపు వెల్లడి

(  ఫైల్ ఫోటో )  

కేజ్రీవాల్‌ రక్తనమూనాల  సేకరణ

కరోనా పరీక్షల  ఫలితం రేపు వెల్లడి 

న్యూఢిల్లీ ,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ): ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు వైద్యులు  కరోనా పరీక్షలు  నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి  కరోనా లక్షణాలైన గొంతునొప్పి, జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. దీంతో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న కేజీవ్రాల్‌ నుంచి వైద్యులు  నమూనాలు  సేకరించారు.  బుధవారం ఉదయానికి ఫలితాలు  వచ్చే అవకాశం ఉన్నది. కరోనా లక్షణాలతో సీఎం కేజీవ్రాల్‌ ఆదివారం మధ్యాహ్నం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ’ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేదని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారని’ ఢిల్లీ  ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సామాజిక వ్యాప్తి, ప్రైవేట్‌ దవాఖానలపై చర్చించడానికి మనీశ్‌ సిసోడియా నేతృత్వంలో ఈరోజు మంత్రిమండలి 
సమావేశం జరిగింది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు