Ticker

6/recent/ticker-posts

Ad Code

శ్రీశైంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఉపాసన



శ్రీశైం,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ ): దాదాపు 75 రోజుల  తర్వాత శ్రీశైం మల్లన్న  ఆలయం తెరుచుకొని ప్రయోగాత్మకంగా దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. గంటకు 300 మంది చొప్పున భక్తులను స్వామి, అమ్మవార్ల దర్శనానికి పంపుతున్నారు. భక్తులు  తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ ముఖాలకు మాస్క్‌లను ధరిస్తున్నారు. ఆలయం ఆవరణలో కట్టధిట్టమైన చర్యలు  తీసుకోవాలని ఉద్యోగులకు శ్రీశైలం  దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు ఆదేశాలు  జారీచేశారు. మంగళవారం ఉదయం ముఖానికి మాస్క్‌ ధరించి వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ,రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల  స్వామివారిని దర్శించుకొన్నారు. చాలా రోజుల  తర్వాత శ్రీశైం మల్లన్న ను  దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని ఉపాసన ఈ సందర్భంగా తనను కలిసిన విూడియాతో అన్నారు. అనంతరం స్థానిక చెంచులు, ఆలయ ఉద్యోగులు, స్థానిక ప్రజలకు పెద్ద మొత్తంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పోలీసులకు మాస్క్‌లతోపాటు పీపీఈ కిట్లను అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు  ఇంటి పట్టునే ఉంటూ జాగ్రత్తలు  పాటించాలని ఆమె సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు