Ticker

6/recent/ticker-posts

Ad Code

కరోనా కట్టడికి మాస్కు తప్పనిసరి


తాజాగా హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ


జెనీవా,జూన్ ‌6(ఇయ్యాల తెలంగాణ): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త సూచన చేసింది. జనం మధ్య ఉన్న సమయంలో.. ముఖానికి మాస్క్‌ను పెట్టుకోవాలని సూచించింది. వైరస్‌ మోసుకెళ్తున్న తుంపర్ల నుంచి మాస్క్‌ రక్షణ కల్పిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా సూచనల్లో అభిప్రాయపడిరది. వాస్తవానికి కొన్ని దేశాలు ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్‌ పెట్టుకోవాలని ఆదేశాలు  జారీ చేశాయి. ఆరోగ్యంగా ఉన్న ప్రజలు  కూడా మాస్క్‌ పెట్టుకోవాలన్న ఆధారాలు  తమ వద్ద ఏవిూ లేవని గతంలో డబ్ల్యూహెచ్‌వో వాదించింనా.. వైరస్‌ వ్యాప్తి జరిగే రిస్క్‌ ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్క్‌ను పెట్టుకోవాలని డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్‌ నిపుణులు  డాక్టర్‌ మారియా వాన్‌ కెర్కోవ్‌ తెలిపారు. అనారోగ్యంగా ఉన్న వారు మెడికల్‌ ఫేస్‌ మాస్క్‌ను ధరించాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. కరోనా వైరస్‌ ఎలా ఎటాక్‌ చేస్తుందో..? ఎక్కడ నుంచి వచ్చి అంటుకుంతుందో  తెలియని పరిస్థితి.. ఇక, కోవిడ్‌ బారినపడినా కొందరిలో లక్షణాలు  కనిపించడంలేదు.. కానీ, టెస్ట్‌ చేస్తే పాజిటివ్‌ అని తేలుతోంది.. అయితే, దీనిపై శాస్త్రవేత్తలు  వార్నింగ్‌ ఇస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న యువతకు కొవిడ్‌ లక్షణాలు  కనిపించకపోయినా.. బ్రెయిన్‌ స్టోక్స్‌ వచ్చే ముప్పు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు  హెచ్చరిస్తున్నారు. మార్చి 20`ఏప్రిల్‌ 10 మధ్య తాము చేసిన పరిశోధనతో ఈ విషయం గమనించామని థామస్‌ జెఫర్సన్‌ విశ్వవిద్యాయ పరిశోధకులు  చెబుతున్నారు. తాము చూసిన స్టోక్స్ర్‌  ఎప్పటిలా సాధారణంగా లేవని న్యూరో సర్జరీ జర్నల్‌లో ప్రచురించారు. 30, 40, 50 ఏళ్ల వయసు కరోనా బాధితుల్లో భారీ స్టోక్స్‌ గమనించామంటున్నారు సైంటిస్టు. సాధారణంగా ఇలాంటి స్టోక్స్‌ 70, 80 ఏళ్ల వయసుల్లో వస్తుంటాయని అంటున్నారు. కరోనా సోకిన 14 మందిలో స్టోక్స్‌ లక్షణాలను పరిశీలిస్తే.. ఫలితాలు  ఆందోళనకరంగా ఉన్నాయని, శాంపిల్‌ సైజ్‌ చిన్నదే అయినా.. రిజల్ట్స్‌ దారుణంగా ఉన్నాయని చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు