తాను చేపట్టిన పాత్రికేయ వృత్తి పట్ల నిబద్ధతతో రెండు రోజుల క్రితం వరకు కూడా అకుంఠిత దీక్షతో విధి నిర్వహణలో తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి చివరకు విధి వక్రీకరించి కరోనా మహమ్మారికి గురై మనోజ్ యాదవ్ అకాల మృత్యువుకు గురికావడం వారి కుటుంబ సభ్యులనే కాక యావత్ ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా ప్రపంచాన్ని కలిచివేసిందని భాజపా కరోనా వారియర్స్ టీం సనత్ నగర్ సభ్యులు స్వామి టాకీస్ లేబర్ అడ్డా వద్ద నిర్వహించిన సంతాప సభలో పేర్కొన్నారు. ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిథులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.
భాజపా మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్, యువమోర్చా నాయకులు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకులు పొలిమేర సంతోష్ కుమార్ లు మాట్లాడుతూ మనోజ్ తమకు సోదరతుల్యుడని అలాంటి వ్యక్తి జీవితం అతి పిన్న వయసులో ఈ విధంగా అర్థాంతరంగా ముగిసిపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ విపత్కర సంఘటన నుండి కోలుకోవడానికి భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు తగిన మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని తాము మనఃస్ఫూర్తిగా వేడుకుంటున్నామన్నారు.
రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, లక్ష్మణ్ పటేల్, విట్టల్ మురళి, శంకర్, విజయ్, కాసాని శివప్రసాద్ గౌడ్, సరిత శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, గోలి వెంకటపతి, మిథుల్ రాజ్, ఫణిమాల, కార్తీక్ వారణాసి, బంటి, కిషోర్, ధర్మేంద్ర, భాను, జె కె ఠాకూర్, ప్రవీణ్ గౌడ్, మురళి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, వరప్రసాద్ చారి, తదితరులు నేటి సంతాప సభలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.