రాజ్‌నాథ్ తన ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీని అటాక్ చేశారు.
న్యూఢిల్లీ,జూన్9(ఇయ్యాల తెలంగాణ): కొన్నాళ్ల నుంచి సరిహద్దు విషయంలో చైనాతో పేచీ జరుగుతున్న క్రమంలో ఆదివారం రాహుల్ చేసిన ట్వీట్ కొత్త వాగ్వాదానికి దారి తీసింది. లడాఖ్‌లో ఏం జరుగుతుందో ప్రతి భారతీయ సైనికుడికి తెలుసు అని, వారి రక్తం మరుగుతోందని, కానీ విూడియా నోరును కూడా నొక్కేశారని రాహుల్ వివాదాస్పద ట్వీట్ చేశారు. దానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్‌గా ఓ ట్వీట్ చేశారు. ఓ కవితను ట్వీట్ చేస్తూ రాహుల్‌కు రాజ్‌నాథ్ సమాధానం ఇచ్చారు. అయితే తాజాగా ఆ ట్వీట్‌ను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ మరో అనుమానాన్ని లేవనెత్తారు. రక్షణ మంత్రి ట్వీట్‌తో ఓ విషయం బయట పడిందని, దానికి ఆయన సమాధానం ఇవ్వగరా అని రాహుల్ అడిగారు. లడాఖ్‌లో ఉన్న భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? అని రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.సోమవారం ఓ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రక్షణ వ్యవస్థకు ప్రపంచదేశాల గుర్తింపు ఉన్నదని, తమ సరిహద్దుల్ని రక్షించుకోవడంలో అమెరికా, ఇజ్రాయిల్ తర్వాత స్థానం భారత్‌దే అని షా అన్నారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ రాహుల్ తొలుత విమర్శలు చేశారు. దానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఓ కౌంటర్ ఇచ్చారు. చేతికి నొప్పి ఉంటే మందు రాయాలని, కానీ చేయి సరిగా లేకుంటే, అప్పుడు ఏం చేస్తామని రాజ్‌నాథ్ తన ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీని అటాక్ చేశారు.