Ticker

6/recent/ticker-posts

Ad Code

ఢిల్లీ ఎయిమ్స్‌పై కరోనా పంజా

ఢిల్లీ ఎయిమ్స్‌పై కరోనా పంజా

 
480 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తింపు
 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సులకు కరోనా పాజిటివ్  

ఆందోళనలో వైద్య, భద్రతా సిబ్బంది



న్యూఢిల్లీ,జూన్‌4 (ఇయ్యాల తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీ లో ఉన్న ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌లో ఇప్పటివరకు 480 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇందులో 19 మంది డాక్టర్లు ఉండగా, 38 నర్సులు, 14 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 74 మంది భద్రతా సిబ్బంది, 75 మంది అటెండెంట్లు, 54 మంది శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. 19 మంది డాక్టర్లలో ఇద్దరు ప్రొఫెసర్లు ఉండగా, మిగిలినవారు రెసిడెంట్‌ డాక్టర్లుగా గుర్తించారు. కరోనాతో ఈ అత్యున్నత దవాఖానలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. ఇందులో ముగ్గురు వైద్య సిబ్బంది ఉండగా, మరొకరు హాస్పిటల్‌ శానిటేషన్‌ సిబ్బందికి ఇన్‌చార్చి ఉన్నారు. ఇలా కరోనా బారినపడుతున్న వైద్యసిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో డాక్టర్లు, నర్సులతోపాటు వైరద్యసిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఎయిమ్స్‌ పై కరోనా పంజా విసురుతున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. అందులో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర  సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. వైద్యులు కరోనా బారిన పడుతుండటంతో అందులో పనిచేసేవారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలకు తెగించి కరోనాతో పోరాటం చేస్తున్న వైద్యులపై రోజురోజుకు ఒత్తిడి పెరిగి పోతున్నది.


 
ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో కరోనాను ఎదుర్కొనడానికి కావాల్సిన అన్ని రకాల  వైద్య పరికరాలను సిద్ధం చేసి ఉంచారు. కేసులు  పెరిగిపోతున్నాయి కాబట్టి దానికి తగినట్టుగా బెడ్స్‌ను, వెంటిలేటర్స్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇకపోతే హాస్పిటల్‌లో విధులు  నిర్వహిస్తున్న పోలీసుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా వైరస్‌తో హాస్పిటల్‌లో మార్చి నెలలో ఔట్‌పేషెంట్‌ విభాగాన్ని మూసివేశారు. ఇలా ఔట్‌పేషెంట్‌ విభాగాన్ని మూసివేయడం దవాఖాన చరిత్రలో ఇదే మొదటిసారి. ఢిల్లీలో  కరోనా కేసులు  పెరుగుతుండటంతో ట్రౌమాకేర్‌ సెంటర్‌ను కరోనా ప్రత్యేక వార్డుగా మార్చారు. డాక్టర్లు, నర్సులకు కరోనా పాజిటివ్‌ రావడంతో రాజధాని నగరంలోని హిందూరావు హాస్పిటల్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌, ఢిల్లీ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏప్రిల్‌ నెలలో సీజ్‌ చేశారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు