Ticker

6/recent/ticker-posts

Ad Code

గాంధీ డాక్టర్లపై దాడి కేసులో కారకులను అరెస్ట్‌ చేసిన పోలీసులు


హైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ): గాంధీ హాస్పిటల్లో మంగళవారం డాక్టర్‌పై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు  అరెస్టు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించబోమని పోలీసులు  తెలిపారు. వైద్యులపై దాడి చేస్తే చాలా కఠినంగా చట్టపరమైన చర్యలు  తీసుకుంటామని పోలీసులు  హెచ్చరించారు. కరోనా విజృంభిస్తోన్న ఈ సమయంలో వైద్యులే మన ఫ్రంట్‌లైన్‌ లీడర్లని పోలీసులు  అన్నారు. మంగళవారం రాత్రి ఓ వ్యక్తి కరోనా వల్ల  మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ వ్యక్తి చనిపోయాడని ఆగ్రహిస్తూ అతని బంధువులు  దాడికి దిగారు. నేరుగా హాస్పిటల్‌ మూడో ఫ్లోర్‌లోని ఐసీయూలోకి వెళ్లి అక్కడున్న ఓ డాక్టర్‌ పై దాడి చేశారు. దాంతో డాక్టర్లంతా తమకు భద్రత కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు డాక్టర్‌పై దాడిచేసిన వ్యక్తులను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. జూనియర్‌ డాక్టర్లపై రెండు నెలల్లో ఇలా దాడులు  జరగడం ఇది రెండోసారి. గాంధీ ఆసుపత్రిలో తమపై దాడిని నిరసిస్తూ జూనియర్‌ డాక్టర్లు ఆందోళన చేపడుతున్నారు. గాంధీ ఆసుపత్రి బయట రోడ్డుపై  బైఠాయించిన వీరిని ఆందోళన విరమించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల  రాజేందర్‌ కోరారు. చర్చల  కోసం వైద్యు ప్రతినిధులు  సచివాలయానికి రావాలని ఆయన ఆహ్వానించారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి దాడికి తెగబడినట్లు ఆరోపణలు  ఎదుర్కొంటున్న ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు  వెల్లడించారు.  వారిపై ఐపీసీలోని వివిధ సెక్షన్‌ల  కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ’వైద్య సిబ్బందిపై ఎలాంటి పరిస్థితుల్లోనూ దాడులను సహించేది లేదు. కఠినమైన చర్యలు  తీసుకుంటాం.’ అని హైదరాబాద్‌ పోలీసులు  కూడా ట్వీట్‌ చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు