Ticker

6/recent/ticker-posts

Ad Code

కరోనా కట్టడికి మోడీ చేసిన సేవలు చరిత్రలో నిలిచి పోతాయి


పారిశుద్ధ్య సిబ్బందికి మరియు ఆశా వర్కర్స్ కు నిత్యావసర సరుకుల పంపిణీ 

హైదరాబాద్ జూన్ 7 (ఇయ్యాల తెలంగాణ
దేశ ఔన్నత్యం కోసం ప్రధాని మోడీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని భాజపా మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్ అన్నారు. రెండవ సారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ ఏడాది కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా అయన సేవలను గుర్తు చేశారు. కరోనా కట్టడి  కోసం మోడీ చేస్తున్న యుద్ధం చరిత్రలో గుర్తుండి పోతుందని గుర్తు చేశారు. 

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గా   రెండవ విడత బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్బంగా హైదరాబాద్ కరోనా వారియర్స్ టీం సనత్ నగర్  ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టింది.  గత 60 రోజులుగా వీరు చేసిన సేవ కార్యక్రమాలను  ప్రతి రోజు వారి వారి  మాధ్యమాల ద్వారా ప్రజలు, పాఠకులు, వీక్షకులకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేరవేసిన ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా విలేకర్లు, ఫొటోగ్రాఫర్లు, సిబ్బందికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.   ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అకుంఠిత దీక్షతో సేవలందించిన పారిశుద్ధ్య సిబ్బందికి మరియు ఆశా వర్కర్స్ సోదరీమణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ఉడుతాభక్తిగా కరోనా వారియర్స్ టీమ్ సనత్ నగర్ తరఫున ఒక పక్షం రోజులకు సరిపడా 18 రకాల నిత్యావసర వస్తువులను స్వామి టాకీస్ లేబర్ అడ్డా వద్ద పంపిణీ చేసినట్లు భాజపా మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో భాజపా యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్,  దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్, మహిళా నాయకురాలు సరిత శ్రీనివాస్ గౌడ్యే, జె కె ఠాకూర్  తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు