అయోధ్య,జూన్10(ఇయ్యాల తెలంగాణ): ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. కుబేర్ తిల ఆయంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంతి నృత్య గోపాల్ దాస్ అధికార ప్రతినిధి కమల్ నయన్ దాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 25 మంది పూజార్లు ఈ అభిషేకంలో పాల్గొన్నారు. గుడి నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాపాడాలని ఆ శివున్ని కోరుతూ ఈ రుద్రాభిషేకం నిర్వహించామని వారు అన్నారు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించి ప్రాథమిక పనులు మొదలు అవుతాయని, ప్రధాన పనులు మొదలయ్యేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.