Ticker

6/recent/ticker-posts

Ad Code

పల్లె ప్రగతితో గ్రామాల అవసరాలు తీరుస్తున్నాం - సీఎస్‌

పారిశుద్ధ పనులతో చెత్తా చెదారం తొలగింపు 

మొక్కలకు నీరు పోస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ 

ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్న సీఎస్‌ 
కామారెడ్డి,జూన్‌5(ఇయ్యా తెలంగాణ): తెలంగాణలో ప్రభుత్వం అమలు  చేసిన పల్లె ప్రగతి, ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాల  ద్వారా గ్రామాల  అవసరాలు  తీరి సుందర గ్రామాలుగా మారుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. అలాగే హరితహారంతో పచ్చదనం వెల్లివిరుస్తోందని అన్నారు. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కామారెడ్డి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రత్యేక హెలీకాప్టర్‌లో కామారెడ్డి చేరుకున్న ఆయన సదాశివనగర్‌ మండలం  తిర్మన్‌పల్లిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. తిర్మన్‌ పల్లిలో మిషన్‌ భగీరథ నల్లాలను, పారిశుద్ధ్య పనులు, హరితహారం నర్సరీని పరిశీలించారు. 


నర్సరీలో మొక్క పెంపకాన్ని ఏ విధంగా చేపడుతున్నారని వాకబు చేశారు. వానాకాలం  పంట సాగు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రైతువేదిక నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. మొదటగా తిర్కన్‌పల్లి గ్రామంలో మిషన్‌ భగీరధ నల్లాలను పరిశీలించారు. కనెక్షన్‌ పైప్‌లకు తప్పని సరిగా నల్లాలను ఏర్పాటు చేయాలని లేకపోతే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.  రోజూ ఎంత సేపు మంచినీరు వస్తుందన్న విషయాన్ని సర్పంచ్‌ బాలరెడ్డి , గ్రామ పంచాయితీ సెక్రటరీ నరేష్‌ను అడిగి తెలుసుకున్నారు. రోడ్లను పరిశీలించారు. ఎలాంటి చెత్త, పిచ్చిమొక్కలు లేకండా రోడ్లను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని సిఎస్‌ అన్నారు.  గ్రామ పంచాయితీ ఆవరణలో ఉన్ననర్సరీని, రైతు ఏ పంట వేయాలన్నది వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామ సభ జరిగిందా... లేదా? అని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాంలో మొక్కజొన్న పంటలకు బదులుగా పత్తి, కంది , సోయాబీన్‌ వేస్తున్నట్టు ఏఈవో తెలిపారు. క్రాస్‌బుకింగ్‌యాడ్‌ను అడిగి     తెలు సుకున్నారు. ఎక్కువ సర్వే నెంబర్లు గల  రైతులు  వేసే పంటలను నీర్ణీత ఫార్మాట్‌లో నమోదుచేసుకోవలని సీఎస్‌ సూచించారు. 


కామారెడ్డి మండంలం  గర్గుల్‌ గ్రామాన్నికూడా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సందర్శించారు. తోలుత మంకీఫుడ్‌ కోర్టును పరిశీలించారు. గ్రామాలో 33 గ్రూపుల్లో 830 ఉపాధి హావిూ కూలీలు  పనిచేస్తున్నారని గ్రామ సర్పంచ్‌ రవితేజ సీఎస్‌ దృష్టికి తెచ్చారు. అనంతరం డంపింగ్‌యార్డు, కంపోస్ట్‌ షెడ్‌ను సీఎస్‌ పరిశీలించారు. కంపోస్ట్‌షెడ్‌లో బెడ్స్‌ ఇంకా పెంచాలని, కంపోస్ట్‌షెడ్‌లో పూర్తి శిక్షణనిచ్చిన వ్యక్తిని నియమించాలని సూచించారు. అనంతరం వైకుంఠధామా పనులను పరిశీలించి అక్కడ మొక్కలునాటారు. ఈ సందర్భంగా సీఎస్‌ వెంటనే పలువురు సీనియర్‌ ఉన్నతాధికారులు   కూడా పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు