హైదరాబాద్, జూన్ 9 ( ఇయ్యాల తెలంగాణ )
ఎం ఐ ఎం పార్టీ అధినేత హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఈ నెల 8 వ తేదీ నుంచి అన్ని మతాలకు సంబందించిన ప్రార్థనా మందిరాలు తెరుచుకున్న సందర్బంగా దేవాలయాలు,మసీదులు,చర్చిలు,గురుద్వారా లాంటి పవిత్రమైన స్థలాలకు టచ్ ఫ్రీ డిస్పెన్సెర్ ( శానిటైజ్ ఫ్రీ మెషిన్ ) లను బహుకరించారు.ప్రార్థనా మందిరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారితో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని ప్రార్థన మందిరాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణను తప్పక పాటిస్తూ ఉండాలని కోరారు. మజ్లీస్ చారిటీ ఎడ్డుకేషనల్ రిలీఫ్ ట్రస్ట్ నుంచి సుమారు 19 లక్షల 70 వేళా రూపాయలతో టచ్ ఫ్రీ డిస్పెన్సరీ మెషిన్ లను కొనుగోలు చేశారు. దారుస్సలాం లోని పార్టీ కార్యాలయంలో కొందరు గురుద్వారా, దేవాలయాల , మసీదుల,చర్చీల ప్రతినిదులకు శానిటైజ్ మెషిన్ లు అంద జేశారు.
దీంతో పాటు స్థానిక కార్పొరేటర్లను కొందరిని పిలిచి తమ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ప్రార్థన స్థలాల లాంటి ధారావాహిక కేంద్రాలకు శానిటైజ్ మెషిన్ లను పంపిణీ చేయవలసినదిగా అసదుద్దీన్ ఆదేశాలు అందించడం జరిగింది. ఈ మేరకు కొందరు కార్పొరేటర్లు తమ తమ డివిజన్ ల పరిధి లోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు,గురుద్వారాలకు శానిటైజ్ మెషిన్ లను పంపిణీ చేయడం జరిగింది. మతాల కతీతంగా ఎం ఐ ఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి శానిటైజ్ మెషిన్ లు పంపిణీ చేయడం పై సర్వత్రా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.