Ticker

6/recent/ticker-posts

Ad Code

శాస్త్రీయ పూజల కోసమే తెరుచుకోనున్న శబరిమల ఆలయం - భక్తులకు ప్రవేశం లేదు



తిరువనంతపురం,జూన్‌11 (ఇయ్యాల తెలంగాణ): శబరిమల  ఆలయాన్ని 14వ తేదీ నుంచి తెరవడం లేదని దేవస్థానం బోర్డు పేర్కొన్నది.  కేవలం  పూజ కోసం మాత్రమే తెరుస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆలయంలోకి భక్తులు ప్రవేశాన్ని రద్దు చేశారు. ఈ నెల  14వ తేదీ నుంచి ఆలయంలో కేవలం  పూజలు  మాత్రమే నిర్వహిస్తారని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ తెలిపారు. దేవస్థాన ప్రధాన పూజారులతో చర్చలు  నిర్వహించిన అనంతరం మంత్రి ఈ విషయాన్ని తెలిపారు.  శబరిమల  తంత్రి, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సభ్యులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాస పూజ కోసం ఆలయాన్ని తెరవాల్సి ఉండగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా.. భక్తులకు ఆలయ అనుమతి కల్పించడం లేదన్నారు. శబరిమల  ఆలయంలో జరగాల్సిన ఉత్సవాన్ని కూడా వాయిదాలు  వేస్తున్నట్లు మంత్రి సరేంద్రన్‌ తెలిపారు. కేవలం  నిత్య పూజ అనంతరం తిరిగి మూసేస్తారని అన్నారు. భక్తులు  ఈ విషయం గమనించి దర్శనం కోసం ఎవరు కూడా రావద్దన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు