Ticker

6/recent/ticker-posts

Ad Code

చిలుకూరు బాలాజీ దర్శనం ఇప్పట్లో ఉండదు : రంగరాజన్

చిలుకూరు బాలాజీ దర్శనం ఇప్పట్లో ఉండదు : రంగరాజన్ 

 8 వ తేదీ తరువాత భక్తులెవరూ ఆలయానికి రావొద్దు 


హైదరాబాద్‌,జూన్‌1(ఇయ్యాల తెలంగాణ):  లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు  ఇచ్చి ఈ నెల  8 నుంచి ప్రార్థనా మందిలు  తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే చిలు కూరు బాలాజీ ఆలయం మాత్రం తెరుచుకోదని ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ తెలిపారు.ఈ మేరకు  ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  చిలుకూరు బాలాజీ స్వామికి ప్రతి రోజు ఏకాంత పూజలు  జరుగుతున్నాయని, కానీ, 8వ తేదీన ఆలయం తెరవబోమని పేర్కొన్నారు. ఆలయం తెరచి భక్తులకు ఎప్పుడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే వివరాలు  వ్లెల్లడిస్తామని చెప్పారు. అంతవరకు భక్తులు  ఎవరు కూడా 8 వ తేదీ నుంచి ఆలయానికి రావొద్దని భక్తులకు సూచించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు