గాంధీలో సరైన సౌకర్యాలు లేవని ఆవేదన
హైదరాబాద్,జూన్8(ఇయ్యాల తెలంగాణ): హైదరాబాద్ నగరంలో కోవిడ్‌తో మరణించిన మనోజ్ అనే రిపోర్టర్ చేసిన ఛాటింగ్ ఇప్పుడు విూడియాలో కలకలం రేపుతోంది. చనిపోవడానికి ముందు మనోజ్ చేసిన చాటింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆస్పత్రిలో వైద్యులు ఇతర సిబ్బంది కోవిడ్ రోగులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీయూలో కూడా పరిస్థితులు సరిగా లేవని వాపోయారు. గాంధీ ఆస్పత్రితో దుస్థితిని వీడియోతో సహా బయటపెట్టారు. గాంధీలో ఆక్సిజన్ పెట్టడం లేదని, తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాని కోరతూ తన సన్నిహితుతో చాట్ చేశారు. మనోజ్ చేసిన చాటింగ్ ప్రస్తుతం సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మనోజ్ మేసేజ్‌తో గాంధీ ఆస్పత్రిలో ఉన్న డొల్లతనం బహిర్గతమైంది. కరోనాతో మృతి చెందిన మనోజ్ వయసు 33 సంవత్సరాలు . శరీరంలోని అన్ని కండరాలను బలహీనం చేసే వ్యాధితో బాధపడేవారు. మనసుకు నచ్చిన యువతిని ఏడు నెల కిందట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సతీమణీ గర్భవతి. తొందరలోనే తండ్రిని కాబోతున్నానని కలలు కన్న మనోజ్‌ను కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. జూన్ 4న మనోజ్, గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్స చేసినా పరిస్థితి విషమించి మృతి చెందారు. గురువారంనాడు ఆరుగురు.. శుక్రవారం ఎనిమిది మంది.. శనివారం పది మంది.. ఆదివారం 14 మంది మరణించారు. . రాష్ట్రంలో కరోనా కాటుకు బలైపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గడచిన 24 గంట వ్యవధిలో ఏకంగా 14 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఆదివారం చనిపోయిన 14 మందిలో 11 మంది 50 ఏళ్లు దాటిన వాళ్లే. వీరిలో కొందరు ఆస్పత్రిలో చేరిన ఒకటి రెండు రోజుల్లోనే చనిపోయారు. అయితీ దీర్ఘకాల వ్యాదులతో బాధపడుతున్న వారిపై కరోనా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తి 15 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివాసం
ఉంటున్నారు. కొంతకాంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన జూన్ 6న మృతి చెందారు. తెలంగాణలో కోవిడ్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారు. కానీ ఆ చేస్తున్న పరీక్షల్లో పాజిటివ్ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే కేసుల సంఖ్యతో పాటు మరణాలు పెరగడంతో ఆందోళన నెలకొంది. ఈ దశలో ఇప్పుడు మనోజ్ చాటింగ్ ఆరోపణకు బలం చేకూర్చింది.
````````