Ticker

6/recent/ticker-posts

Ad Code

ఐసిఎంఆర్‌ సైంటిస్ట్‌కు కరోనా


ఐసిఎంఆర్‌ సైంటిస్ట్‌కు కరోనా 

కార్యాలయం మూసివేత

నీతి ఆయోగ్‌ మూడో ఫ్లోర్‌కు సీలు 


న్యూఢిల్లీ ,జూన్‌1(ఇయ్యాల తెలంగాణ ): ఐసీఎంఆర్‌కు చెందిన ఓ శాస్త్రవేత్తకు కరోనా వైరస్‌ పాజిటవ్‌ వచ్చింది.   ముంబై నుంచి రెండు రోజుల  క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు నిర్వహించిన పరీక్షలో.. కోవిడ్‌19 పాజిటివ్‌ తేలినట్లు సమాచారం.  ముంబైలోని నేషనల్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఫర్‌ రీసర్చ్‌ ఇన్‌ రీప్రొడెక్టివ్‌ హెల్త్‌ లో ఆ సైంటిస్టు పనిచేస్తున్నట్లు సమాచారం.   ఢిల్లీ లోని ఐసీఎంఆర్‌ ప్రధాన కార్యాయంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.  దీంతో ఢిల్లీ  కార్యాయాన్ని శానిటైజ్‌ చేస్తున్నారు.  ఆయన ఎవరెవర్ని కాంటాక్ట్‌ అయ్యారన్న దానిపై కూడా ట్రేసింగ్‌ జరుగుతున్నట్లు ఐసీఎంఆర్‌ అధికారులు  వెల్లడించారు. కొవిడ్‌`19 కోర్‌ టీమ్‌లో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్తకు నిర్దారణ అయినట్లు ఐసీఎంఆర్‌ అఫీషియల్‌ వాట్సాప్‌ గ్రూపులో మెసేజ్‌ వచ్చింది. దీంతో ఢిల్లీ  లోని ఐసీఎంఆర్‌ భవనాన్ని రెండు రోజుల  పాటు మూసివేస్తున్నామని.. శాస్త్రవేత్తలు  ఇంటి నుంచే పనిచేయాలని సూచించారు. ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ రీప్రొడక్టివ్‌ హెల్త్‌, ముంబైలో ఆ శాస్త్రవేత్త పనిచేస్తున్నారు.ఢిల్లీ  లోని ప్రధాన కార్యాయంలో ఐసీఎంఆర్‌ చీఫ్‌ డాక్టర్‌ బలరాం భార్గవతో గత వారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయన ఎవరెవరినీ కాంటాక్ట్‌ అయ్యారనే వివరాలను ట్రేసింగ్‌ చేసి పరీక్షలు  నిర్వహిస్తున్నట్లు అధికారులు  తెలిపారు. కాగా..భారతదేశంలో కరోనా కేసులు   1.90 లక్షలు  దాటాయి. ప్రపంచంలో కరోనా కేసులు  అత్యధికంగా నమోదైన దేశాల  జాబితాలో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. దేశంలో నమోదైన కేసుల్లో 44 శాతం కేసులు  ఒక్క మహారాష్ట్రలోనే ఉండటంతో ఆందోళనకరంగా మారుతోంది. మహారాష్ట్రలోనూ ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో 80 శాతం కేసులు  ఇక్కడే నమోదవుతున్నాయి అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. మరోవైపు  నీతి ఆయోగ్‌ సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్‌ ఉందని తేలడంతో ఢిల్లీ లోని నీతి ఆయోగ్‌ కార్యాలయం ఉన్న మూడో ప్లోర్‌ను సోమవారం సీల్‌ చేశారు. ప్రస్తుతం శానిటేషన్‌ పనులు  జరుగుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో విదేశీ వ్యవహారాల  మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న ఇద్దరు అధికారులకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. పాజిటివ్‌గా నిర్దారణ అయిన వారిలో ఒక వ్యక్తి ఢిల్లీ  లోని విదేశాంగ శాఖ సెంట్రల్‌ యూరోప్‌ డివిజన్లో పని చేస్తున్న అధికారి కాగా, మరొకరు న్యాయ విభాగంలో లీగల్‌ అధికారిగా పనిచేస్తున్నారు. సౌత్‌ ఢిల్లీ  మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌డీఎంసీ)లోని ఓ శానిటేషన్‌ ఉద్యోగి సైతం బదర్‌పూర్‌లో కోవిడ్‌తో కన్నుమూసినట్టు ఎస్‌డీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు దేశంలో కోవిడ్‌ కేసుల  సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. సోమవారం నాటికి కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల  సంఖ్య 1,90,535కు చేరినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిలో 91,819 యాక్టివ్‌ కేసులు  కాగా, 91,918 మంది ఆసుపత్రుల  నుంచి డిశ్చార్చి అయ్యారు. 5,394 మంది మృతి చెందారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు