ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ మేరకు నేటి నుంచి ఆరా
హైదరాబాద్,మే29 (
ఇయ్యాల తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసుల పై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సర్వెలైన్స్ సర్వే నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్ జోన్లలో రెండు రోజుల పాటు జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ టీమ్స్ అధ్వర్యంలో శనివారం నుంచి ఐసీఎంఆర్ ఈ సర్వే చేపట్టనుంది. నగరంలోని ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో సర్వెలైన్స్ సర్వే జరగనుంది. అందుకు సంబంధించి 5 ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్‌ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు చేశారు. ఈ ఐదు కంటైన్మెంట్ జోన్లలో కరోనా కేసులు , వాటి పరిస్థితి, లక్షణాల పై ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. సర్వే ద్వారా హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు , నాస్ సింప్టమిక్ కేసులపై ఐసీఎంఆర్ పూర్తిస్థాయి నివేదిక తయారుచేయనుంది. ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఐసీఎంఆర్ సర్వే పూర్తి చేసింది. వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ఐసీఎంఆర్ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 60 జిల్లాల్లో సర్వే నిర్వహించి, 24 వేల శాంపిల్స్‌ను సేకరించారు. నాలుగు కేటగిరీల కింద ఈ సర్వే నిర్వహించనున్నారు. . తెలంగాణ రాష్ట్రంలో జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే ఈ సర్వే జరిపారు. వైరస్ ట్రాన్స్మిషన్ ఏమైనా జరిగిందా..! ఎవరికైనా వైరస్ సోకిన తర్వాత యాంటీ బాడీస్ పెరిగాయా..? లాంటి అంశాలను పరిశీలిస్తూ ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఇదిలావుంటే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని డిప్యుటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కానీలో ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో స్థానిక కార్పొరేటర్ గద్వాల్ విజయక్ష్మి కోరిక మేరకు కాలనీలో శానిటైజేషన్ పక్రియను చేపట్టారు. హైపో క్లోరైడ్ ద్రావణాన్ని కానీ మొత్తం పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా డిప్యుటీ మేయర్ మాట్లాడుతూ..నగరంలో కరోనాను ఎదుర్కునేందుకు అన్ని
రకాల చర్యలు తీసుకుంటున్నామని, పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను కంటెయిన్మెంట్ చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేస్తున్నామన్నారు. కరోనా రాకుండా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.