పదవ తరగతి పరీక్షల నిర్వహణపై పకడ్బందీ చర్యలు తీసుకోండి
ప్రభుత్వానికి పులికంటి నరేష్ వినతి
హైదరాబాద్, మే 30 (ఇయ్యాల తెలంగాణ )
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని,విద్యార్థులకు పూర్తి భద్రతను కల్పించాలని ఎస్సీ డెవెలప్ మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పులికంటి నరేష్ ప్రభుత్వాన్ని కోరారు. రోజు రోజుకు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా పరీక్షలు రాసేలా చూడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నదని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న దృష్ట్యా మరింత ఆచితూచి అడుగువేయాల్సిన పరిస్థితి ఉన్నదని తెలిపారు. పరీక్ష సెంటర్లను కూడా ప్రస్తుతం ఉన్న వాటి కంటే ఎక్కువగా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో లా కాకుండా విద్యార్థులు ఒకరికొకరు ఎక్కువ దూరంగా కూర్చునేలా చర్యలు తీసుకోవాలని కోరారు., ఒక
తరగతి గదిలో 10 మంది విద్యార్థులను మించి ఉండకుండా చూడాలన్నారు. ఒకవేళ తరగతి గదులు చాలా చిన్నవిగా ఉంటె మరింత తక్కువ సంఖ్యలో విద్యార్థులు కూర్చునేలా చేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకార్యాలు ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. పరీక్ష సెంటర్లలో అన్ని రకాల వసతులు ఉండేలా ఆయా విద్య సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.కరోనా మహమ్మారి దృష్ట్యా భయాందోళన మధ్య పిల్లలు పరీక్ష రాసే పరిస్థితులు ఉన్నాయని పరీక్షా కేంద్రాలకు వెళ్లిన విద్యార్థులు అక్కకి పరిస్థితులను చూసి నిర్భయంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేపట్టాలని నరేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం అందరి ద్రుష్టి పదవ తరగతి విద్యార్థులపైనే కేంద్రీ కృతమై ఉన్నదని వారికి ఎలాంటి నష్టం జరుగ కుండా చూడాలని పులి కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి జిల్లా విద్యా శాఖ అధికారికి ఆన్ లైన్ సేవల ద్వారా ఆయన వినతిని అందజేశారు. ఇందులో భాగంగా పదవ తరగతి పరీక్షల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.