1991 లో స్థాపించిన వెల్ఫేర్ కమిటీ ని అభినందించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు

విజయపురి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా నాగరాజు రావు

హైదరాబాద్,సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా సేవలందిస్తూ తమ కాలనీలను అన్ని విధాలా సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకుంటున్న వెల్ఫేర్ సభ్యుల కృషి ఏంతో  అభినందనీయమని  డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. విజయపురి వెల్ఫేర్ అసోసియేషన్  స్థాపించిన 1991 వ సంవత్సరం నుంచి విజయపురి కాలనీ లో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మళ్ళీ ఎన్నికైన  నాగరాజు రావును ఆయన శనివారం శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్బంగా వెల్ఫేర్ సభ్యులకు డిప్యూటీ స్పీకర్ ప్రత్యేక అభినందనలతో కొనియాడారు. ఏండ్ల తరబడి విశిష్ట సేవలందిస్తూ తమ కాలనీలను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకోవడం గర్వకారణమని కొనియాడారు. గత 94 సంవత్సరాలుగా అధ్యక్షులు గా ఉన్న నాగరాజు రావు ఈ అసోసియేషన్ ను ఎంతో అభివృద్ధి పరిచి, ఈ వయసులో కూడా యువ ఉత్సాహంతో పరుగులు పెడుతున్న ఉత్సాహం చాలా హర్షణీయమని పద్మారావు అభిప్రాయపడ్డారు. 

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ని,  రైల్వే కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఇందిరా ని, కాలనీవాసులు, వీరమాచనేని పడగయ్య హై స్కూల్ కరస్పాండెంట్ రమేష్ బాబు లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఐకాన్ రామేశ్వర్ గౌడ్, యంగ్ లీడర్ కిషోర్ గౌడ్ ,టీఆర్ఎస్ సిటీ జాయింట్ సెక్రెటరీ రాజేష్ గౌడ్, డాక్టర్ కటకం గంగాధర్, సునీల్ ,కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....