18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరు గుర్తింపు కార్డులు

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్


హైదరాబాద్, జనవరి 12 (ఇయ్యాల తెలంగాణ) :  నూతనంగా ఓటరు జాబితాలో నమోదు చేసిన ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు జాతీయ ఓటరు దినోత్సవం తేదీ 25.1.22 నాడు అంద చేయాలని చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ ఓటరు దినోత్సవం, నూతన ఓటరు జాబితా, తదితర అంశాలపై బుధవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 5న తుది ఓటరు జాబితా రూపొందించామని, అందులో 18 సంవత్సరాలు నిండిన నూతనంగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు జాతీయ ఓటరు దినోత్సవం నాడు నూతన ఓటర్ ఎపిక్ కార్డులను  కిట్లు అంద జేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించి ప్రారంభించుకున్న ఈ విఎం గోదాంలలోకి ఈ వి ఎంలు (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లు ) లను వారం లోగా తరలించాలని తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం ను కోవిడ్ నిబంధనల ప్రకారం  నిర్వహణ పై  ఆయన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, డి రమాదేవి సిబ్బంది ఈ వీసి లో పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....