16న కొరివి కృష్ణస్వామి 154వ జయంతి వేడుకలు

హైదరాబాద్, ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ) :దివంగత కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ సేవలు ఎనలేనివని తెలంగాణ ఉద్యమకారుడు పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. ఈ నెల 16 వ తేదీన జరిగే కొరివి కృష్ణ స్వామి 154 వ జయంతి వేడుకలు చుడిబజార్ లో ఘనంగా నిర్వహించ నున్నట్లు తెలిపారు. ముదిరాజ్ పెద్దలు మరియు రాజకీయ నాయకులు  విచ్చేసి జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. స్వర్గీయ కృష్ణస్వామి గోషామహల్ కార్పొరేటర్ గా,  మేయర్ గా ఒక పత్రిక విలేకరిగా ఎంతో సేవలందించారని కొనియాడారు. ఆ రోజుల్లో తోపుడు బండ్లు చూసి చలించిపోయిన కృష్ణస్వామి ముదిరాజ్ మూడు చక్రాల వాహనా న్ని తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో పేదలకు సేవలు అందించిన మహనీయుడని గుర్తు చేశారు.  ఆ రోజుల్లో అన్ని బీసీ కులాలని ఏకతాటిపై తెచ్చి మహా సభను ఏర్పాటు చేసిన కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్  అటువంటి మహానుభావుడు జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించి కృష్ణ స్వామికి సరైన గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....