12న తెలంగాణకు మోడీ

  

హైదరాబాద్‌, జూన్‌ 28, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ విజయం కోసం ఎప్పుడో ప్లాన్స్‌ అమలు చేస్తున్నాయి. వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై మరింత ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే రాష్ట్రనాయకులను ఢల్లీి పిలిచి మాట్లాడిరది. ఇప్పుడు అగ్రనేతలు ఒక్కొక్కరుగా తెలంగాణలో పర్యటించబోతున్నారు. అందులో భాగంగా జులై 12 ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్నారు. మహా జన్‌ సంపర్క్‌ అభియాన్‌?లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటిస్తారు. ఆయన మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే రోడ్‌షో నిర్వహించబోతున్నారని సమాచారం. కర్ణాటక తరహాలోనే హైదరాబాద్‌ ?లో కూడా ప్రధాని మోదీ రోడ్‌ షో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పరిధిలో మోదీ రోడ్‌ షోతో పాటు సికింద్రాబాద్‌ లేదా హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో భారీ బహిరంగ సభ ఉంటుందని చెబుతున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....