హైదరాబాద్‌ Old City లో గందరగోళం


మాతృశ్రీ కాలేజీలో ప్రారంభం కాని ఉద్యోగ పోటీ పరీక్ష

అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థులకు  శాపం

 పరీక్షా కేంద్రం వద్ద తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్‌, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) : సైదాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం ఉదయం హాస్టల్‌ వెల్ఫేర్‌  ఆఫీసర్‌ నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్ష 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది అయితే రెండున్నర గంటల తర్వాత కూడా పరీక్ష ప్రారంభం కాకపోవటంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థుల తల్లిదండ్రులు, బంధువులు పరీక్షా కేంద్రం వెలుపల ఆందోళనకు వెళ్లారు వారికి మద్దతుగా ఆందోళనకు దిగిన బీజేపీ యువమోర్చా నాయకులు ధర్నా చేశారు. బీజేపీ యువమోర్చా నాయకులను సైదాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు. అయితే పరీక్ష ప్రారంభం కాకపోవడానికి సాంకేతిక సమస్య కారణంగా తెలుస్తుంది. టీజీపీఎస్సీ తరఫున పరీక్ష నిర్వహించాల్సిన టిసిఎస్‌ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా తెలుస్తుంది ఆన్లైన్‌ విధానంలో నిర్వహించాల్సిన పరీక్షకు ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రంలో కంప్యూటర్లను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ టిసిఎస్‌ వారు పరీక్ష నిర్వహించే సోమవారం ఉదయం కేంద్రానికి వచ్చి ఏర్పాట్లు వేయడం తో అవి పని చేయలేదు. అభ్యర్థుల ఆందోళన తెలుసుకున్న అధికారులు ఈ కేంద్రంలోని అభ్యర్థులకు పరీక్షను రీ షెడ్యూల్‌ చేశారు. ఈ మేరకు సంస్థ వెబ్సైట్లో సమాచారాన్ని పొందుపరిచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....