హైదరాబాద్, ఆగస్టు1, (ఇయ్యాల తెలంగాణ );మెట్రో ట్రైన్, కేబుల్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లతో ఉన్న హైదరాబాద్‌లో మరో అద్భుతమైన కట్టడం ఆకట్టుకోనుంది. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ జంక్షన్ వరకు, అటు జింఖానా గ్రౌండ్ నుంచి తూంకుంట వరకు ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు రానున్నాయి. చెరో 18కిలోవిూటర్లు మేర ఈ కట్టడాలు ఆకట్టుకోనున్నాయి.ఈ ప్రాజెక్టులకు 150.414 ఎకరాల రక్షణ స్థలం అవసరం కానుంది. దీంతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం పంపించింది. ఈ భూమికి బదులు వరే ప్రాంతంలో 500 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పడంతో రక్షణ శాఖ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రెండు స్కైవేల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లకు సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను ఒకే పిల్లర్‌పై నిర్మించనున్నారు. ఇలాంటి ప్రయోగానికి గతంలో నాగపూర్ వేదిక అయింది. అక్కడ సుమారు 38 కిలోవిూటర్ల ఈ తరహా నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు అదే స్టైల్‌లో హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌లు రానున్నాయి. ఈ డబులవ్ డెక్కర్ ఫ్లైఓవర్‌లో కింద, మధ్యలో నార్మల్ వెహికల్స్ నడిస్తే పైన మెట్రో రైలు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌తో ఖర్చు తక్కువ అవుతుందని… అదే టైంలో ఆస్తుల సేకరణ కూడా భారీగా తగ్గిపోనుంది. ఒకే పిల్లర్‌పై ఫ్లైఓవర్ నిర్మాణం పర్యాటక ప్రదేశంగా కూడా మారుతుందని అంటున్నారు. ఔటర్ రింగ్‌రోడ్‌వైపు వెళ్లే వాళ్లకు వచ్చే వాళ్లకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు
ఓఆర్‌ఆర్ పై 120 కిలోవిూటర్ల స్పీ
డు;హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వేగం విషయంలో కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త వేగ పరిమితిని అత్యధికంగా 120 కిలో విూటర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు నోటిఫికేషన్ జారీ చేశారు. వేగ పరిమితిని తాజాగా 120 కిలో విూటర్లకు పెంచారు. గతంలో ఈ అత్యధిక వేగం పరిమితి 100 కిలో విూటర్లుగా ఉండేది. ఆ పరిమితి దాటి దూసుకెళ్లేవారిపై స్పీడ్ గన్ల సాయంతో జరిమానా వేసేవారు. ఇప్పటికైతే ఔటర్ రింగ్ రోడ్డు పైకి టూ వీలర్స్, నడిచి వెళ్లే వారికి అనుమతి లేని సంగతి తెలిసిందే. ఆ నిబంధనను అలాగే కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేన్ 1 అండ్ 2 లో 100 నుంచి 120 కిలోవిూటర్ల స్పీడ్ లిమిట్‌తో వెళ్లొచ్చు. లేన్ 3 అండ్ 4 లో 80 నుంచి 100 కిలోవిూటర్ల స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఐదో లేన్ లో 40 కిలో విూటర్ల స్పీడ్ లిమిట్ ఉంటుంది. 40 కిలో విూటర్ల స్పీడ్ కన్నా తక్కువ వేగంతో వెళ్లే వాహనాలకు ఔటర్ రింగ్ రోడ్డు పైకి అనుమతి లేదు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు సహా, నగరం విూదుగా మరో ప్రాంతానికి వెళ్లే వారికి ఔటర్ రింగ్ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో కూడా దూర ప్రాంతానికి వెళ్లాల్సిన వారు కూడా ట్రాఫిక్ నుంచి తప్పించుకోడానికి వీలును బట్టి ఔటర్ రింగ్ రోడ్డును వాడుతుంటారు.మరోవైపు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ విషయంలోనూ ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. టోల్ ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు రోడ్లపై గుంతలు, ఇతర నిర్వహణ లోపాలు సరి చేయాలని చెబుతున్నారు. ఓఆర్‌ఆర్ పై పెద్ద సంఖ్యలో గుంతలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ విూడియాలో వీడియోలు పెడుతున్నారు. వీటిలోనూ ముఖ్యంగా 3, 4 లేన్లలో ఎక్కువగా గుంతలు పడ్డాయని.. దీంతో భారీ వాహనాలు 1, 2 లేన్లలోకి వస్తుండడంతో ప్రమాదాలుజరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాకాలం కాబట్టి, గుంతలు ఏర్పడ్డాయని త్వరలోనే గుంతలు పూడుస్తామని అధికారులు చెబుతున్నారు.