హైదరాబాద్‌ మరోసారి ED దాడులు కలకలం

 

హైదరాబాద్‌ ఆగష్టు 1 (ఇయ్యాల తెలంగాణ ): జూబ్లీహిల్స్‌, మణికొండ, పంజాగుట్టలో అధికారుల సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్‌, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాబశివరావు ఇంటితోపాటు పలువురి ఇండ్లలో సోదాలు చేస్తున్నారు.మాలినేని సాంబశివరావు ట్రాన్స్‌ ట్రై పవర్‌ ప్రాజెక్ట్‌, టెక్నో యూనిట్‌న్ఫ్ఫ్రా టెక్‌, కాకతీయ క్రిస్టల్‌ పవర్‌ లిమిటెడ్‌, ట్రాన్స్‌ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే బ్యాంక్‌ల నుంచి తీసకున్న రుణాలను ఈ సంస్థలు ఎగ్గొటినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....