హైదరాబాద్ పరిధిలో విస్తరిస్తున్న పాజిటివ్ కేసు
భయాందోళనలో జనాలు
మాదన్నపేట ఘటనపై ఆరా తీస్తున్న పోలీసులు
హైదరాబాద్,మే16(ఇయ్యాల తెలంగాణ ): జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. మాదన్నపేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో 23 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్దారించారు. చైతన్యపురి ప్రశాంతినగర్‌లో మహిళకు కరోనా పాజిటీవ్, చందానగర్ జవహర్‌నగర్ రోడ్డులో 80 ఏళ్ల వృద్ధురాలికి పాజిటివ్.. అలాగే పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో తండ్రీ, కుమారుడికి కరోనా వైరస్ సోకినట్లు సమాచారం. తండ్రి ఒక పరిశ్రమలో చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు ప్రైమరీ కాంటాక్ట్స్‌పై ఆరా తీస్తున్నారు. కరోనా వైరస్ నివారణలో భౌతిక దూరం పాటించకపోవడంతో జరిగే అనర్థాల పై ప్రభుత్వాలు , పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. … ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి తాజా నిదర్శనం నగరంలోని సంతోష్ నగర్ మాదన్నపేట్ సంఘటన. స్థానిక ఓ అపార్ట్ మెంటల్‌లో నివాసం ఉండే 23 మందిలో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఇటీవల అపార్ట్ మెంట్‌లో జరిగిన ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో వీరంతా పాల్గొన్నారు. బర్త్ డే వేడుకతో కరోనా వైరస్ విస్తరించింది. బర్త్ డే వేడుకలకు హాజరైన మరో ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్టు తేలిందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మాదన్నపేటను కంటైన్మెంట్ క్లస్టర్‌గా మార్చడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.