హైదరాబాద్ నగర శివారు లో హల్ చల్ చేస్తున్న చిరుత
హైదరాబాద్ మే 14 ఇయ్యాల తెలంగాణ
హైదరాబాద్ నగర శివారు లోని కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి హల్ చల్ చేస్తుంది. కాటేదాన్ ప్రాంతంలోని అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ప్రాంతంలో సంచారం చేస్తున్న చిరుత జనాలకు కనిపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న ఈ చిరుత ఎటు కదల లేక ఒకే దగ్గర కూర్చుండి పోయింది. కొందరు కేకలు విన్న చిరుత అక్కడి నుంచుజి పరుగు తీసింది . ఈ చిరుత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. కానీ అటవీ శాఖా అధికారులు పులిని పట్టుకొనే పనిలో బిజీగా ఉన్నారు.